News
News
X

Warangal: ఇతను పదోక్లాసు ఫెయిల్, కానీ డాక్టర్! పదేళ్ల నుంచి ఇదేపని - ఎలా సాధ్యమైందంటే

ప్రియాంక క్లినిక్ పేరుతో శివునిపల్లి, స్టేషన్ ఘనపూర్ లో వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. నకిలీ సర్టిఫికేట్లతో గత 10 సంవత్సరాలుగా వైద్యుడిగా చలామణి అవుతున్నాడు.

FOLLOW US: 

Warangal Fake Doctor Arrest: నకిలీ సర్టిఫికేట్లతో గత 10 సంవత్సరాలుగా వైద్యుడిగా చలామణి అవుతున్న నకిలీ డాక్టర్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ నకిలీ డాక్టర్ (Warangal Fake Doctor) నుంచి క్లినిక్‌ నిర్వహణకు సంబంధించిన పరికరాలు, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పదో తరగతి ఫెయిల్.. కానీ డాక్టర్ అంటూ క్లినిక్ నిర్వహణ

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ టాస్క్ ఫోర్స్ (Warangal Taskforce Police) అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శివునిపల్లి, స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన ఆకాష్ కుమార్ బిశ్వాస్ అలియాస్ బీఏ కుమార్ అనే వ్యక్తి పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. గతంలో ఇతను వైద్యుడైన ఆయన తాత వద్ద సహాయకుడిగా కొంత కాలం పని చేశాడు. ఈయన తాత కూడా ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండానే వైద్యం చేసేవాడు. ఇలా కొంత కాలం పని చేయడం ద్వారా వైద్యం చేయడంలో అనుభవం రావడంతో ఇతను కూడా డాక్టరుగా చెలామణి అయి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలకున్నాడు. 

నిందితుడు ప్రియాంక క్లినిక్ (Priyanka Clinic) పేరుతో శివునిపల్లి, స్టేషన్ ఘనపూర్ లో వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. సహాయకుడిగా పని చేసిన అనుభవంతో నిందితుడు తన వైద్యశాలకు సాధారణ రోగాలతో వచ్చే రోగులకు చికిత్స అందిస్తూ రోగుల వద్ద పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసేవాడు. జీవితంలో పైల్స్, ఫిషర్, బ్లీడింగ్ పైల్స్, ఫిస్టులా, హైడ్రోసిల్ (Hydrocele diseases) (బుడ్డ)  మళ్లీ రాకుండా ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తాను అంటూ గత 10 సంవత్సరాల నుండి దాదాపు 3,560 మంది వరకు వైద్యం చేశాడు. 

News Reels

రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ కి రెఫర్

ఒకవేళ రోగులకు వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే నగరంలోని కార్పొరేట్ హస్పిటళ్లకు వెళ్ళమని సూచించేవారు. నిందితుడు వేరు వేరు హాస్పిటల్స్ నుండి కూడా పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకునేవాడు. ఈ నకిలీ డాక్టర్ భాగవతం కాస్తా టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక స్టేషన్ ఘన్ పూర్, డిప్యూటీ DMHO, స్టేషన్ ఘనపూర్ వైద్య విభాగానికి చెందిన వైద్యుల అధ్వర్యంలో క్లినిక్ పై దాడులు నిర్వహించారు. ఆ నకిలీ డాక్టర్ ను విచారణ చేయడంతో నిందితుడు తాను పాల్పడుతున్న నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు.

ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అభినందనలు

ఈ నకిలీ డాక్టర్ (Station Ghanpur Fake Doctor News) వ్యవహారంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు లవణ్ కుమార్, సిబ్బందిని డీసీపీ వైభవ్ గైక్వాడ్, వరంగల్ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అభినందించారు.

Published at : 21 Nov 2022 06:06 PM (IST) Tags: Fake Doctors Warangal News taskforce police doctors in warangal station ghanpur news

సంబంధిత కథనాలు

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

TS News Developments Today: నేడు రాజ్యాంగ దినోత్సవం- తెలంగాణ ‌టుడే అజెండాలో ముఖ్యాంశాలు ఇవే!

TS News Developments Today: నేడు రాజ్యాంగ దినోత్సవం- తెలంగాణ ‌టుడే అజెండాలో ముఖ్యాంశాలు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

టాప్ స్టోరీస్

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!