Ananthapur: బిడ్డ తన పోలికలతో పుట్టలేదని చంపేసిన తండ్రి.. అనంతరం మరో ఘోరం
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రెండు నెలల వయసు ఉన్న పసిపాపను కన్న తండ్రే దారుణంగా చంపేశాడు.
అనంతపురం జిల్లాలో దారుణమైన అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. రెండు నెలల పసి బిడ్డను కన్న తండ్రే హతమార్చాడు. అనంతరం పాప శవాన్ని చెరువులో పడేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే, ఆ పని పాపను కన్న తండ్రి చంపినందుకు గల కారణాలు మరీ విస్తుగొలిపేలా ఉన్నాయి. ఇటీవలే జన్మించిన ఆడ బిడ్డ విగతజీవిగా పడి ఉండేసరికి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతికి గంజాయి గిఫ్టుగా ఇచ్చాడు.. తర్వాత ట్విస్టు మామూలుగా లేదు..
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రెండు నెలల వయసు ఉన్న పసిపాపను కన్న తండ్రే దారుణంగా చంపేశాడు. పాప తన పోలికలతో పుట్టలేదంటూ ఆ చిన్నారిని తండ్రి మల్లికార్జున చంపేసి చెరువులో పడేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కల్యాణదుర్గానికి చెందిన మల్లికార్జున భార్యకు రెండు నెలల క్రితం ప్రసవం అయింది. పుట్టిన బిడ్డకు తన పోలికలు రాలేదని మల్లికార్జున భార్యతో గొడవ పడ్డాడు. గత రెండు నెలల నుంచి ఈ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటి నుంచి బుధవారం నాడు పాపను తండ్రి మల్లికార్జున బయటకు తీసుకెళ్లాడు. ఎంతకీ మల్లికార్జున ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
Also Read: మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !
తండ్రి, పాప కోసం నిన్నటి నుంచి పోలీసులు వెతికారు. చివరికి స్థానికంగా ఉన్న చెరువులో పాప శవం తేలుతూ కనిపించినట్లుగా స్థానికులు వెల్లడించారు. దీంతో పోలీసులు చెరువు నుంచి పాప మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదే సమయంలో మల్లికార్జున్ పోలీసులకు ఫోన్ చేసి పాపను తానే చంపినట్లు అంగీకరించాడు. అనంతరం బెంగళూరు వెళ్లానని పోలీసులకు తెలిపాడు. చిన్నారి తల్లితో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: దర్శకుడు శంకర్ అల్లుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిని..
Also Read: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!
Also Read: అన్ని నగరాల్లో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎంతంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి