అన్వేషించండి

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Anantapur Crime News: కొన్ని హత్య కేసులు పోలీసులకు ముప్పతిప్పలు పెడతాయి. అలాంటిదే అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. కేవలం మూడు వస్తువులతో ఛేదించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అనంతపురంలో కాలిపోయిన మృతదేహం; జంధ్యం, అప్పడాల ప్యాకెట్ క్లూలు.
  • క్లూల ఆధారంగా బళ్లారి మూగ వ్యక్తి గురురాజారావుగా గుర్తింపు.
  • నిందితులు మృతుడి ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసి పట్టుబడ్డారు.
  • డబ్బుల కోసం మూగ వ్యక్తులిద్దరు గురురాజారావును హత్య చేశారు.

Anantapur Crime News: అనంతపురం జిల్లా డీ హీరేహాల్‌లో ఒక డెడ్‌ బాడీ ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెళ్లి చూస్తే డెడ్‌బాడీ కాలిపోయి ఉంది. అసలు ఆ వ్యక్తి ఎవరో? అక్కడ ఎందుకు చంపేశారో క్లూలు లేవు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేవు. చుట్టుపక్కల మిస్సింగ్ కేసులు కూడా రిజిస్టర్ కాలేదు. కానీ కేవలం జంధ్యం, సగం కాలిన పేపర్‌, అప్పడాల ప్యాకెట్‌తో కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను గుర్తించారు. కానీ వారు మూగ చెవిటి వాళ్లు కావడంతో నిర్దారించుకోవడానికి టైం తీసుకున్నారు.     

క్లూలెస్‌గా డెడ్‌బాడీ కేసు 

జూన్ 23వ తేదీని అనంతపురం జిల్లా పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. డీహీరేహాల్ మండలంలోని పులకుర్తిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని చెప్పారు. వెంటనే పోలీసులు స్పాట్‌కు వచ్చారు. చనిపోయింది మగ వ్యక్తి అని మాత్రమే గుర్తు పట్టారు. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అక్కడ అతన్ని కాల్చేశారు అనేది మాత్రం క్లూలెస్‌గా మారింది. అయితే స్పాట్‌లో మాత్రం ఒక జంధ్యం, సంగ కాలిన కన్నడ పేపర్‌, అప్పడాల ప్యాకెట్‌ దొరికింది. 

మూడు వస్తువులతో కేసు దర్యాప్తు

ఈ మూడింటి ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. అప్పడాల ప్యాకెట్‌ చెన్నైకు చెందింది తెలిసింది. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ వివరాలు తెలిశాయి. ఆయన్ని ప్రశ్నిస్తే బళ్లారికి చెందిన గురురాజారావుగా తేల్చారు. మూగ, చెవిటి వ్యక్తి అయిన ఇతను అప్పడాలు అమ్ముకొని జీవించే వాడని తేలింది. ఆయన కనిపించడం లేదని కూడా గుర్తించారు. దీంతో చనిపోయింది గురురాజారావుగా కన్ఫామ్‌ చేసుకున్నారు. 

డబ్బు డ్రా చేసి పోలీసులకు చిక్కిన నిందితులు

చనిపోయింది ఎవరో గుర్తించిన పోలీసులు అసలు నిందితుల ఎవరూ అని ఆరా తీయడం మొదలు పెట్టారు. మృతుడితో పరిచయం ఉన్న వారంతా కూడా చెవిటి, మూగవారే. కాబట్టి వారిని అనుమానించలేదు. కేసు ఎలా ముందుకు వెళ్తుందని పోలీసులు డైలమాలో పడ్డారు. ఇంతలో మృతుడి బ్యాంక్ నుంచి కొంత డబ్బు డ్రా అయ్యింది. 

ఇదే కేసులో టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా అయిన సంగతి తెలుసుకున్న పోలీసులు బ్యాంకు వారితో మాట్లాడారు. వెంటనే వాళ్లు ఏ ఏటీఎంలో డబ్బులు డ్రా అయ్యాయో వివరాలు చెప్పారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు అందజేశారు. దాన్ని చూసిన పోలీసులు షాక్ తిన్నారు. అక్కడ డబ్బులు డ్రా చేసింది ఇద్దరు వ్యక్తులు బసవరాజు, కోటేష్‌. వారిద్దరు కూడా మూగ, చెవిటి వాళ్లే. 

దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడానికి సైగల భాష నిపుణుల సాయం తీసుకున్నారు. వారితో కేసులో పురోగతి సాధించారు. వారిద్దరే ఈ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. గురురాజారావు వద్ద డబ్బులు ఉన్నాయని భావించిన వీళ్లిద్దరు అతన్ని నమ్మించి మోసం చేశారు. ఫుల్‌గా మద్యం తాగించి కళ్లల్లో కారం కొట్టి హత్య చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డీహీరేల్‌ వద్ద డెడ్‌బాడీని తగలబెట్టేశారు. 

Frequently Asked Questions

అనంతపురం జిల్లాలో కాలిపోయిన మృతదేహం ఎక్కడ దొరికింది?

అనంతపురం జిల్లాలోని డీ హేరేహాల్ మండలంలోని పులకుర్తిలో ఒక గుర్తు తెలియని కాలిపోయిన మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మొదట వ్యక్తి వివరాలు క్లూలెస్‌గా ఉన్నాయి.

పోలీసులకు దొరికిన మృతదేహం కేసును ఛేదించడానికి ఏ ఆధారాలు సహాయపడ్డాయి?

ఘటనా స్థలంలో దొరికిన జంధ్యం, సగం కాలిన కన్నడ పేపర్, అప్పడాల ప్యాకెట్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఈ వస్తువులే బాధితుడి గుర్తింపునకు కీలకంగా మారాయి.

హత్యకు గురైన వ్యక్తి ఎవరు?

హత్యకు గురైన వ్యక్తి కర్ణాటకలోని బళ్లారికి చెందిన గురురాజారావుగా గుర్తించారు. ఆయన మూగ, చెవిటి వ్యక్తి, అప్పడాలు అమ్ముకొని జీవించేవాడు.

నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారు?

మృతుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా అయిన తర్వాత పోలీసులు ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను బసవరాజు, కోటేష్‌గా గుర్తించారు. వారు కూడా మూగ, చెవిటి వారే.

హత్యకు గల కారణం ఏమిటి?

గురురాజారావు వద్ద డబ్బులు ఉన్నాయని భావించి, నిందితులు అతన్ని మోసం చేసి, మద్యం తాగించి, కళ్ళల్లో కారం కొట్టి హత్య చేశారు. సాక్ష్యాలను మాయం చేయడానికి మృతదేహాన్ని తగలబెట్టారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget