Amalapuram: పేరుకు ఎక్సైజ్ ఆఫీసర్.. బుద్ధి మాత్రం నీచం.. అసభ్యకర మాటలు! అక్కడ చేతులేస్తూ వెకిలి పనులు
సాధారణ కాల్ చేస్తే ఎక్కడ రికార్డింగ్‌లు చేస్తుందోనని కేవలం తనకు వాట్సాప్ కాల్స్ మాత్రమే చేసేవాడని బాధితురాలు తెలిపింది.
రాత్రి తొమ్మిదయ్యిందంటే చాలు తీరుబడిగా పడుకుని మొదలెడతాడు.. ముందు ఆ మాట.. ఈ మాట చెపుతాడు.. ఆఖరికి తన మనసులో ఉన్న అసలు ఉద్దేశాన్ని కక్కుతాడు.. అడిగింది ఇచ్చేయొచ్చుకదా.. అంటూ వేధిస్తాడు.. అది ఫోన్లో మాత్రమే.. అదే డైరెక్ట్‌గా ఒంటరిగా గనుక దొరికితే ఓపెన్ అయిపోతాడు.. నీకు అదిచేస్తాను, ఇది చేస్తానని నమ్మించేందుకు ట్రై చేస్తాడు.. ఒక్కోసారి అసహనంతో ఊగిపోయి నువ్వు ఆపని చేయలేదు.. ఈ రిపోర్ట్ రాయలేదంటూ ఒంటికాలిపై లేస్తాడు.. టోటల్‌గా ఆ యువతి అర్ధం చేసుకోవాల్సింది ఒకటే.. ఏంటంటే అణువణువునా కామ కోర్కెలు నింపుకున్న అతగాడి చెబుతున్నదానికి ఓకే అనాలి..
బాధితురాలు చాలా ఓపిగ్గా వేధింపులు భరించింది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో వికృత చేష్టలను చవి చూసింది. కావాలనే రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంచేసి నేను డ్రాప్ చేస్తానని చెప్పడం.. ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ప్రయివేట్ పార్ట్స్‌పై చేతులు వేయడం.. ఎవరికైనా చెపితే ఉద్యోగంలో నుంచి తీయించేస్తానని బెదిరించడం వంటివి చేసేవాడు.. అయినా ఆమె మౌనంగా భరించింది.. అయినప్పటికీ ఒప్పుకోకపోయే సరికి ఆ అధికారి ఇక ఉద్యోగం నుంచి తీయించేశాడు. ఇక విసిగి వేశారిపోయిన ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపే పనిలో పడ్డారు.
ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లిక్కర్ గౌడౌన్ మేనేజర్ ఆదినారాయణరావు వికృత చేష్టలకు పరాకాష్ఠ. కాగా బాధితురాలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. అమలాపురం నల్లవంతెన దిగువనున్న లిక్కర్ గౌడౌన్‌లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఓ యువతి పని చేస్తోంది. ఈ గౌడౌన్‌కు మేనేజర్‌గా ఎక్సైజ్‌శాఖ ఉద్యోగి ఆదినారాయణ రావు పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత యువతి వాపోయింది. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, తరచూ రాత్రి వేళల్లో ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని, అదే గౌడౌన్‌లో ఎవరూ లేని సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. తనను ఆఫీసుకు వెళ్లాలని కాకినాడ కారులో రమ్మని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని, అప్పటినుంచి ఎప్పుడు రమ్మన్నా బస్సులోనే వస్తానని చెప్పేదాన్నని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ లైంగిక వేధింపులపై తొలుత కాకినాడ దిశ పోలీస్ స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఈ సంఘటన అమలాపురం పరిధిలో జరగడంతో అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు సిఫారసు చేశారు. దీంతో అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా గౌడౌన్ మేనేజర్ తనతో జరిపిన అసభ్య ఫోన్ సంభాషణల రికార్డులను జతచేసింది.
వాట్సాప్ కాల్ చేయాలంటూ ఒత్తిడి..
సాధారణ కాల్ చేస్తే ఎక్కడ రికార్డింగ్‌లు చేస్తుందోనని కేవలం తనకు వాట్సాప్ కాల్స్ మాత్రమే చేసేవాడని బాధితురాలు తెలిపింది. అక్కడికీ తాను రాత్రి అయ్యేసరికి మొబైల్ డేటా ఆఫ్‌లో ఉంచేదాన్నని సాధారణ కాల్ చేసి ఆన్‌లైన్‌లోకి రమ్మని అప్పుడు వాట్సాప్ కాల్స్ చేసి వేధించేవాడని వాపోయింది. ఈ పరిస్థితుల్లో వేరే సెల్‌ఫోన్‌లో అతని మాటలన్నీ రికార్డు చేయాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన కోరిక తీర్చలేదని కక్షసాధింపు చర్యగా తనను ఉద్యోగం లోనుంచి తీయించేశాడని తనకు న్యాయం చేయాలని పోలీసులను బాధిత యువతి కోరింది.