అన్వేషించండి

Zomato IPO Listing: దూసుకుపోయిన జొమాటో.. తొలిరోజే అదిరే ఆరంభం

ఐపీఓలో తొలిరోజే జొమాటో ఛాంపియన్ గా నిలిచింది. మదుపర్లకు మంచి విందు భోజనాన్నే అందించింది. ఈరోజు జొమాటో షేరు రూ.115-138.90 మధ్య కదలాడింది.

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో తన ట్రేడింగ్‌ ప్రస్థానాన్ని ఆరంభించిన జొమాటో (zomato) మొత్తానికి ఛాంపియన్‌ అనిపించుకుంది. లక్షల మంది మదుపర్ల ఆశల్ని కూడగట్టుకొని భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలి యూనికార్న్‌గా చరిత్ర సృష్టించింది. గత కొన్ని నెలలుగా ఊరించిన జొమాటో (zomato) ఐపీఓ.. అందరూ ఊహించినట్లుగానే మదుపర్లకు తొలిరోజు మంచి రుచి చూపించింది. మదుపర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు.

ట్రేడింగ్‌ సాగిందిలా...

ఐపీఓ ధర రూ.76కు 51.32 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ.115 వద్ద.. ఎన్‌ఎస్‌ఈలో 52.63 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద జొమాటో (zomato) ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టింది. 10:08 గంటల సమయంలో 82.17 శాతం ప్రీమియంతో రూ.138.90 వద్ద జొమాటో (zomato) షేరు ధర అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్లు దాటి రూ.1,08,067.35కు చేరింది. అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో కొద్దిసేపటికి 115 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. ఆపై ట్రేడింగ్‌ ముగిసే వరకు షేరు 120-130 మధ్య స్థిరంగా కదలాడింది. చివరకు 65.79 శాతం లాభంతో 126 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.98 వేల కోట్లకు చేరింది. ఇలా ఈరోజు జొమాటో (zomato) షేరు.. రూ.115-138.90 మధ్య కదలాడింది.

విశిష్టతలు..

లిస్టింగ్‌లో 50 శాతానికి పైగా ప్రీమియం సాధించిన అతికొద్ది కంపెనీల సరసన జొమాటో (zomato) చేరింది. అలాగే జొమాటోలాగే తొలిరోజే రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను సాధించిన కంపెనీలు కూడా చాలా తక్కువ. దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా బీఎస్‌ఈలో టాప్‌ 50 జాబితాలో జొమాటో (zomato) చేరింది. ప్రముఖ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్‌, శ్రీ సిమెంట్స్‌ను సైతం వెనక్కి నెట్టింది.

అంచనాలను మించి..

వాస్తవానికి విశ్లేషకులు జొమాటో షేరు 27-30 శాతం ప్రీమియంతో లిస్టవుతుందని అంచనా వేశారు. కానీ, అలాంటి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మరోవైపు జొమాటో (zomato) విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.. కానీ, వాటన్నింటినీ అధిగమించి జొమాటో (zomato) షేరు తొలిరోజు.... తన ప్రస్థానాన్ని సాగించింది. భారత్‌లో కన్జ్యూమర్‌ టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో వాటాల కోసం ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో జొమాటో లిస్టింగ్‌ నిరూపించింది. మరికొన్ని రోజుల్లో పేటీఎం, పాలసీబజార్‌, మొబిక్విక్‌, ఫ్లిప్‌కార్ట్‌, నైకా వంటి ఐపీఓలకు మంచి మార్కెట్‌ను సృష్టించి పెట్టింది.

ALSO READ:

RBI SALARIES: సెలవు రోజుల్లో కూడా జీతాలు, పింఛన్ డబ్బులు... ఆర్బీఐ శుభవార్త

PPF Investment: ప్రతి నెలా రూ.2 వేలతో 50 లక్షలు పొందండి ఇలా..!

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget