By: ABP Desam | Updated at : 05 Jan 2022 07:23 PM (IST)
xiaomi
షావోమి ఇండియా చిక్కుల్లో పడింది! రూ.653 కోట్లు కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు తెలిసింది. ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఎగవేతను గుర్తించి షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (షామి ఇండియా)కు మూడు షోకాజ్ నోటీసులు పంపించింది.
భారత్‌లో ఎంఐ బ్రాండ్‌తో షావోమి ఇండియా మొబైల్స్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో కొన్నింటిని విదేశాల నుంచి షావోమి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. లేదంటే విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్డ్ చేస్తుంది. దేశంలోని స్మార్ట్‌ఫోన్ విపణిలో షావోమికి గణనీయమైన వాటానే ఉంది.
విలువను తగ్గించి షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని డీఆర్‌ఐ తెలిపింది. సంబంధిత కంపెనీ, ఒప్పంద తయారీ సంస్థల్లో పరిశోధన చేపట్టామని పేర్కొంది. దర్యాప్తులో షామి ఇండియా ప్రాంగణంలో అనుమానాస్పందంగా కనిపించిన పత్రాలను డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. ఒప్పంద నిబంధన ప్రకారం క్వాల్‌కామ్ యూఎస్‌ఏ, బీజింగ్ షావోమి మొబైల్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు షావోమి ఇండియా రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నట్టు గుర్తించింది.
To the Monicas of the world (and more so, to the people with a Monica in their life)- here's an app that #DoesItAll while you churn out other chores!
Take control of your #MiRobotVacuumMopP on the #MiHomeApp by scheduling, mapping, and more!https://t.co/C7yjeneFaw pic.twitter.com/sQgksjNrTN— Xiaomi India | #Xiaomi11iHypercharge ⚡ (@XiaomiIndia) January 5, 2022
'షావోమి ఇండియా, సంబంధిత తయారీ కంపెనీల్లోని కీలక ఉద్యోగుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశాం. షావోమి కంపెనీ డైరెక్టర్ ఒకరు రాయల్టీ చెల్లించినట్టు ధ్రువీకరించారు' అని డీఆర్‌ఐ ప్రకటించింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లించడమే కాకుండా ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తి లావాదేవీల విలువను జోడించలేదని వెల్లడించింది. దీంతో షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేసినట్టు గుర్తించామని పేర్కొంది.
'డీఆర్‌ఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత షావోమి టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 01-4-2017 నుంచి 30-06-2020 కాలానికి రూ.653 కోట్లు రికవరీకి డిమాండ్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశాం. 1962, కస్టమ్స్ చట్టం ప్రకారం వీటిని జారీ చేశాం' అని డీఆర్‌ఐ తెలిపింది.
Welcome to 2022's first launch from the house of Xiaomi. Know more about the India's Fastest Charging Smartphone and how it will change smartphone charging forever.
— Xiaomi India | #Xiaomi11iHypercharge ⚡ (@XiaomiIndia) January 5, 2022
Come be a part of the #HyperChargeRevolution. https://t.co/S7AqWAZbQL
Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>