By: ABP Desam | Updated at : 12 Jan 2022 12:00 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత జీడీపీ
India’s economic growth: భారత ఆర్థిక వ్యవస్థ 2022 (FY22) ఆర్థిక ఏడాదిలో 8.3 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2021, అక్టోబర్లో వెలువరించిన నివేదికలో అంచనా వేసిన 8.3 శాతం వృద్ధిరేటు అంచనాలను సవరించలేదు. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ఆర్థిక అంచనా నివేదిక ప్రకారం వీటిని వెల్లడించింది.
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును ప్రపంచ బ్యాంకు 8.3 శాతంగా అంచనా వేసినప్పటికీ రిజర్వు బ్యాంకు అంచనాల కన్నా కాస్త తక్కువగానే ఉండటం గమనార్హం. గతంలో ఆర్‌బీఐ భారత జీడీపీ వృద్ధిరేటును 9.5 శాతంగా అంచనా వేసింది. ఆ తర్వాత దానిని 9.2 శాతానికి సవరించింది. ఏదేమైనా ప్రస్తుత, వచ్చే ఏడాదిలో పొరుగు దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
2022-23, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ వరుసగా 6.4, 6.9 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇక నేపాల్ 3.9, 4.7 శాతం వృద్ధిరేటును అంచనా వేసింది. దాయాది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రస్తుత ఏడాదిలో 3.4, వచ్చే ఏడాది 4 శాతం వృద్ధిరేటు సాధించనుంది.
తాజాగా ఒమిక్రాన్ వేరియెంట్ రావడం, సరఫరా గొలుసులో ఇబ్బందుల వల్ల ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు మందగిస్తోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అంతేకాకుండా గతంలో ఆయా దేశాలు ప్రకటించిన ఆర్థిక ఆలంబన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముగింపునకు వస్తున్నాయని పేర్కొంది. 2021లో 5.5 శాతంగా అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఈ సారి 4.1 శాతానికి తగ్గిపోతుందని వెల్లడించింది. వేగంగా వ్యాప్తిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్‌తో ప్రస్తుత అంచనా రేటు 3.4 శాతానికి తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read: ITR Filing Date Extended: టాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్! మార్చి 15 వరకు గడువు పెంపు
Also Read: Vodafone Idea Shareholders: వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!
Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే
Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Cryptocurrency Prices Today: నష్టాల్లో బిట్‌కాయిన్.. ఎంత నష్టపోయిందంటే?
Stock Market News: ఆరంభంలో అదుర్స్! ఎండింగ్లో ఒడుదొడుకులు - సెన్సెక్స్, నిఫ్టీ డౌన్!
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం