News
News
X

Credit Score: మంచి క్రెడిట్‌ స్కోర్‌ అవసరమా, లేకపోతే నష్టమేంటి?

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థలు సిబిల్‌ స్కోరు ఆధారంగానే రుణాలు మంజూరు చేస్తుంటాయి. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వవు.

FOLLOW US: 

Credit Score: క్రెడిట్‌ స్కోర్.. ఈ రెండు పదాలను కొన్నేళ్ల క్రితం చాలామంది పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మంచి స్కోర్‌ లేనిదే ఎక్కడా అప్పు పుట్టదు. ఒక్క EMI కట్టలేకపోయినా, అప్పు ఇచ్చిన కంపెనీ ఏమంటుందో అన్న భయం కాకుండా, క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుందేమోనన్న భయం వెంటాడుతుంది.

మన ఆర్థిక జీవితాలకు తుమ్మ జిగురులా అంటుకున్న ఈ క్రెడిట్‌ స్కోర్‌ని మన దేశంలో నాలుగు కంపెనీలు వ్యక్తిగత క్రెడిట్‌ స్కోర్‌ను అందిస్తున్నాయి. అవి.. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, క్రిఫ్‌ హైమార్క్‌. అప్పు తీసుకున్నవాళ్లు చేసే చెల్లింపుల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇవి స్కోర్‌ను అందిస్తుంటాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థలు సిబిల్‌ స్కోరు ఆధారంగానే రుణాలు మంజూరు చేస్తుంటాయి. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వవు. 

క్రెడిట్‌ స్కోర్‌ అంటే?
క్రెడిట్ స్కోర్‌ను మన ఆర్థిక క్రమశిక్షణకు ఆధార్‌ కార్డ్‌గా చెప్పుకోవచ్చు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే వ్యక్తిగత రుణాలు, హౌస్‌ లోన్లు, బంగారం మీద తీసుకునే అప్పులు, క్రెడిట్‌ కార్డ్‌ ఔట్‌స్టాండింగ్‌, ఈ మధ్య కొత్తగా వచ్చిన 'బయ్‌ నౌ పే లేటర్‌' వంటివాటిని తిరిగి సరిగా చెల్లిస్తున్నామో లేదో చెప్పే నంబరే క్రెడిట్‌ స్కోర్‌. ఇది 300-900 మధ్య ఉంటుంది. తీసుకున్న రుణాల మీద చేసే చెల్లింపుల ఆధారంగా ఈ 300-900 మధ్య ఒక నంబర్‌ను క్రెడిట్‌ స్కోర్‌గా మీకు కేటాయిస్తారు. 

మంచి స్కోర్‌ - భలే  ప్రయోజనాలు
మీరు ఏదైనా ఆర్థిక సంస్థ వద్దకు రుణం కోసం వెళ్తే, వాళ్లు మొదటగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌నే. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే పెద్ద మొత్తంలో రుణాలను ఆఫర్‌ చేస్తాయి. మంచి స్కోర్‌ ఉన్నవాళ్లకు వడ్డీ రేట్ల విషయలో బేరమాడే శక్తి కూడా ఉంటుంది. మీరు కోరుకున్న రేటుకే అప్పు కావాల‌న్నా, రుణ ప‌రిమితి పెర‌గాల‌న్నా, కొత్త క్రెడిట్ కార్డులు అవ‌స‌ర‌మున్నా, ఒక బ్యాంక్‌ నుంచి మరొక బ్యాంక్‌కు లోన్‌ మార్చుకోవాలన్నా వెంటనే ఓకే అవుతుంది. అంటే, మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక్కోసారి ప్రాసెసింగ్‌ ఛార్జీలను తగ్గిస్తారు, లేదా పూర్తిగా మాఫీ చేస్తారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, ఇలాంటి ప్రయోజనాలేవీ మీకు అందవు.

స్కోర్‌ పరమార్థం
800 నుంచి 900 : ఎక్స్‌లెంట్‌ లేదా అద్భుతమైన స్కోరు
740 నుంచి 799: వెరీ గుడ్‌ లేదా చాలా బాగుంది
670 నుంచి 739: గుడ్‌ లేదా బాగుంది
580 నుంచి 669: ఫెయిర్ లేదా పర్లేదు
300 నుంచి 579: పూర్‌ లేదా అస్సలు బాగోలేదు

గుడ్‌ నుంచి ఎక్స్‌లెంట్‌ రేంజ్‌ అంటే 670 నుంచి 900 రేంజ్‌లో ఉన్నవాళ్ల క్రెడిట్‌ స్కోర్‌ బాగున్నట్లు, వీళ్లకు ఆర్థిక సంస్థల నుంచి అప్పులు త్వరగా పుడతాయి. ఈ స్కోర్‌ మూడు నెలలకు ఒకసారి మారుతుంది. ఇంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. స్కోర్‌ను ప్రొవైడ్‌ చేసే కంపెనీ విధానం మీద ఇది ఆధారపడి ఉంటుంది. 

మీ క్రెడిట్‌ స్కోర్‌ ఇప్పుడు బాగున్నా, ఇకపై మీ చెల్లింపులు గాడి తప్పితే, దానికి అనుగుణంగా స్కోర్‌ కూడా తగ్గుతుందని గుర్తుంచుకోవాలి.

Published at : 20 Sep 2022 03:05 PM (IST) Tags: credit score Credit Card CIBIL Score Good Credit Score Credit rating

సంబంధిత కథనాలు

Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌ కీలక నిర్ణయం, ఇక బిజినెస్‌ పరుగో పరుగు

Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌ కీలక నిర్ణయం, ఇక బిజినెస్‌ పరుగో పరుగు

Stocks to watch 27 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫుల్‌ ఫోకస్‌లో Amara Raja

Stocks to watch 27 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫుల్‌ ఫోకస్‌లో Amara Raja

Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!

Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!

Gold-Silver Price 27 September 2022: బెజవాడ, భాగ్యనగరం కంటే చెన్నైలోనే స్వర్ణం చవక, ఇవిగో రేట్లు

Gold-Silver Price 27 September 2022: బెజవాడ, భాగ్యనగరం కంటే చెన్నైలోనే స్వర్ణం చవక, ఇవిగో రేట్లు

Stock Market Closing Bell 26 September 2022: మార్కెట్‌లో మరొక బ్లాక్‌ మండే, కీలక మార్క్‌ దగ్గర నిలబడ్డ నిప్టీ

Stock Market Closing Bell 26 September 2022: మార్కెట్‌లో మరొక బ్లాక్‌ మండే, కీలక మార్క్‌ దగ్గర నిలబడ్డ నిప్టీ

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి