News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

WhatsApp New Feature: పేయూ, రేజర్‌పేతో వాట్సాప్‌ ఒప్పందం! గూగుల్‌లో వెతికే వెబ్‌పేజీ తయారు చేసుకొనే ఫీచర్‌

WhatsApp New Feature: యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వాట్సాప్‌ విపరీతంగా శ్రమిస్తోంది. వరుస పెట్టి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

FOLLOW US: 
Share:

WhatsApp New Feature: 

యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వాట్సాప్‌ విపరీతంగా శ్రమిస్తోంది. వరుస పెట్టి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెండు రోజుల క్రితమే ఛానళ్లను ప్రవేశపెట్టిన వాట్సాప్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ కంపెనీలు రేజర్‌పే, పేయూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో యూజర్లు ఇకపై థర్డ్‌ పార్టీ యాప్‌ను ఆశ్రయించకుండానే నేరుగా వాట్సాప్‌ ద్వారానే డబ్బులు చెల్లించొచ్చు.

'రేజర్‌పే, పేయూతో వాట్సాప్ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో భారతీయులు యాప్‌ ద్వారానే షాపింగ్‌ చేయొచ్చు. చెల్లింపులు చేపట్టొచ్చు. నేరుగా ఛాట్‌ ద్వారానే డబ్బులు చెల్లించడాన్ని సులభతరం చేస్తున్నాం' అని మెటా వెల్లడించింది. 'నేటి నుంచి భారతీయులు నేరుగా కార్టులోకి ఉత్పత్తులను జత చేసి తమకు నచ్చిన పద్ధతిలో డబ్బులు చెల్లించొచ్చు. ఇందుకోసం యూపీఐ యాప్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడుకోవచ్చు' అని తెలిపింది.

పేమెంట్‌ సర్వీసులతో పాటు వాట్సాప్‌ 'ప్లోస్‌' (Flows) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వ్యాపారులు తమకు నచ్చిన విధంగా ఫామ్స్‌ను రూపొందించొచ్చు. ఛాట్‌ విండోను క్లోజ్‌ చేయకుండానే రైలు టికెట్లు, ఆహారం, అపాయింట్‌మెంట్లను బుక్‌ చేసుకోవచ్చు. 'ఫ్లోస్‌తో వ్యాపారులు అనేక అంశాలు ఉండే మెనూ, వివిధ అవసరాలను బట్టి తమకు నచ్చిన విధంగా ఫామ్స్‌ను సృష్టించొచ్చు' అని వాట్సాప్‌ తెలిపింది. రెండు, మూడు వారాల్లో ఫ్లోస్‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.

వాట్పాప్‌ బిజినెస్‌ కోసం మెటా వెరిఫికేషన్‌నూ తీసుకొస్తున్నట్టు తెలిసింది. మెటా వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ తీసుకున్నవారికి మెరుగైన అకౌంట్‌ సపోర్ట్‌, భద్రతను అందించనుంది. 'మెటా వెరిఫికేషన్‌తో అదనపు ప్రీమియం ఫీచర్లు తీసుకొస్తున్నాం. తమ అవసరాలకు తగినట్టు వాట్సాప్‌ పేజీని సృష్టించుకోవడం అందులో ఒకటి. దీనిని వెబ్‌లో సెర్చ్‌ చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు కలిసి వినియోగదారుల ప్రశ్నలకు వేర్వేరు డివైజుల నుంచి సమాధానాలు ఇవ్వొచ్చు. మొదట మెటా వెరిఫికేషన్‌ను చిన్న వ్యాపారస్థుల ద్వారా పరీక్షిస్తాం. భవిష్యత్తులో వాట్సాప్‌ బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తాం' అని వాట్సాప్‌ తెలిపింది.

వాట్సాప్‌ను మానిటైజ్‌ చేసేందుకు భారత్‌ను అత్యంత కీలక మార్కెట్‌గా భావిస్తున్నట్టు మెటా భారత్‌ అధినేత సంధ్యా దేవనాథన్‌ కొన్ని రోజుల ముందే పేర్కొన్న సంగతి తెలిసిందే. గ్లోబల్‌, భారత్‌ నాయకత్వం స్థానిక మార్కెట్‌పై దృష్టి సారించాయని ఆమె వెల్లడించారు.

ఇక వాట్సాప్ కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి యాప్‌లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. 'కాల్స్' ట్యాబ్‌లో కంపెనీ ఈ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం మీరు కాల్స్ ట్యాబ్‌కు వెళ్లినప్పుడు పైన కాల్ లింక్ ఎంపికను చూస్తారు. అయితే త్వరలో కంపెనీ దాన్ని 'న్యూ కాల్' ఆప్షన్‌తో భర్తీ చేయబోతోంది. ఇది కాకుండా త్వరలో మీరు 31 మందిని కాల్‌కు యాడ్ చేయగలరు. అంటే మీరు కాల్ చేయడం ప్రారంభించిన వెంటనే ఒకేసారి 31 మందిని కాల్‌కు యాడ్ చేసే ఆప్షన్ లభించనుంది. ప్రస్తుతం మీరు మొదటగా 15 మందిని మాత్రమే జోడించగలరు. ఇప్పుడు ఈ సంఖ్యను 32 మందికి పెంచనున్నారు.

ఈ అప్‌డేట్ గురించిన సమాచారం Wabetainfo వెబ్ సైట్ షేర్ చేసింది. ఈ అప్‌డేట్ వాట్సాప్ బీటా 2.23.19.16లో కనిపించింది. వాట్సాప్‌కు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను పొందడంలో మీరు కూడా మొదటి వ్యక్తి కావాలనుకుంటే, మీరు కంపెనీ బీటా ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకోవచ్చు.

Published at : 20 Sep 2023 02:48 PM (IST) Tags: WhatsApp Razorpay PayU in app shopping

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్‌ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే

Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్‌ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే

Share Market Opening Today 04 December 2023: మార్కెట్‌లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Share Market Opening Today 04 December 2023: మార్కెట్‌లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Stocks To Watch Today 04 December 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' LIC, Granules, CAMS, Hero

Stocks To Watch Today 04 December 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' LIC, Granules, CAMS, Hero

టాప్ స్టోరీస్

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
×