By: ABP Desam | Updated at : 15 Feb 2023 10:42 AM (IST)
Edited By: Arunmali
అమెరికాలో తగ్గిన ద్రవ్యోల్బణం
US Inflation Data: ద్రవ్యోల్బణం విషయంలో అగ్రరాజ్యం అమెరికా ఒక శుభవార్త చెప్పింది, ఇది మొత్తం ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు ఉపశమనం కలిగించే న్యూస్.
జనవరి నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం (Inflation in America) తగ్గింది. యూఎస్ వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2022 డిసెంబర్‌లోని 6.5 శాతం నుంచి 2023 జనవరిలో 6.4 శాతానికి తగ్గింది. బ్యూరో ఆఫ్ లేబర్ గణాంకాల ప్రకారం, అమెరికాలో ద్రవ్యోల్బణ రేటును కొలవడానికి కొత్త పద్ధతులు ఉపయోగించారు.
అగ్రరాజ్యంలో ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం 10.1 శాతంగా ఉన్నా, 2021 అక్టోబర్ గరిష్టం కంటే ఇది చాలా తక్కువ. ఇంధన ధరల ద్రవ్యోల్బణం 8.7 శాతంగా నమోదైంది.
ఫెడ్ లక్ష్యిత స్థాయి కంటే ఎక్కువే
గత సంవత్సరం, 2022 జూన్ నెలలో అగ్రరాజ్యం చిల్లర ద్రవ్యోల్బణం రేటు (Retail inflation Rate) 9.1 శాతానికి చేరుకుంది, అప్పటి నుంచి అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు నిరంతరంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం, అక్కడ ద్రవ్యోల్బణం రేటు 6.4 శాతానికి చేరినా, ఫెడరల్ రిజర్వ్ (US FED) లక్ష్యమైన 2 శాతం కంటే ఇప్పటికీ మూడు రెట్లు ఎక్కువగానే ఉంది.
యూఎస్ ఫెడ్ లక్ష్యిత స్థాయి కంటే ప్రస్తుత ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నా, జనవరి నెలలో ఉపాధి గణాంకాలు (American Job Data) మాత్రం చాలా బలంగా ఉన్నాయి. ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ కొత్త ఉద్యోగాలను జనవరిలో కల్పించారు. అమెరికాలో, జనవరి నెలలో 5,17,000 కొత్త ఉద్యోగాలు యాడ్ అయ్యాయి. తద్వారా నిరుద్యోగం రేటు 3.4 శాతానికి తగ్గింది, ఇది 53 సంవత్సరాలలో కనిష్ట స్థాయి.
అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం నిరంతరం తగ్గుతున్నప్పటికీ, అప్పుల భారం నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశ మాత్రం లేదు. 2023 ఫిబ్రవరి 1న, ఫెడ్ రిజర్వ్ తన వడ్డీ రేటును మరో పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచింది, రాబోయే రోజుల్లోనూ ఇదే కఠిన వైఖరి కొనసాగే అవకాశం ఉంది.
గత ఏడాది, అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు 41 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గరిష్ట ద్రవ్యోల్బణాన్ని కిందకు దించడానికి ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిరంతరంగా రుణ రేట్లు పెంచుతూ వచ్చింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇంకా కొనసాగించినట్లయితే, ఈ సంవత్సరం US పాక్షిక మాంద్యాన్ని ఎదుర్కొంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
వడ్డీ రేట్ల పెంపు ఆపినా చాలు, గ్లోబల్ మార్కెట్లకు ఉపశమనం!
అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా, US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిరంతరం వడ్డీ రేట్లు పెంచుతూ, రుణాలను మరింత భారంగా మారుస్తోంది. దీని కారణంగా అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడిదార్లు ఈక్విటీలను విక్రయిస్తున్నారు, అమెరికన్ డెట్ పేపర్లలోకి ఆ పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది కాబట్టి, యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేటును తగ్గించినా, పెంచడం ఆపేసినా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లకు అది గుడ్ న్యూస్ అవుతుంది. అమెరికన్ డెట్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలోకి తిరిగి వస్తాయి.
SEBI: మ్యూచువల్ ఫండ్స్ నామినేషన్ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట
Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ స్టాక్స్తో జాగ్రత్త
Gold-Silver Price 29 March 2023: ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర, ఇప్పటికీ హై రేంజ్లోనే రేటు
Petrol-Diesel Price 29 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు బిల్లు, చుక్క కూడా ముఖ్యమే
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్