అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' L&T, Whirlpool, CIE Auto

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 20 February 2024: నిన్న రికార్డు స్థాయిలో ముగిసిన నిఫ్టీ, ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ సెషన్‌ను నిరాడంబరంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్న ఆసియా మార్కెట్లు ఇండియన్‌ ఈక్విటీలపై ప్రభావం చూపించొచ్చు.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 66 పాయింట్లు లేదా 0.3 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,180 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం, నికాయ్‌, హాంగ్ సెంగ్, తైవాన్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. స్ట్రెయిట్స్ టైమ్స్ ఫ్లాట్‌గా ఉండగా, కోస్పి 0.5 శాతం క్షీణించింది.

నిన్న ప్రెసిడెంట్స్ డే సెలవు కారణంగా US మార్కెట్‌లో ట్రేడింగ్ జరగలేదు. 

US 10-ఇయర్స్ బాండ్ ఈల్డ్ 4.3 శాతం స్థాయిలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు $83.50 స్థాయికి చేరాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

వర్ల్‌పూల్: ప్రమోటర్ కంపెనీ వర్ల్‌పూల్ మారిషస్ (WML), వర్ల్‌పూల్ ఇండియాలో 30.4 మిలియన్ షేర్లు లేదా 24 శాతం ఈక్విటీ వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా ఈ రోజు అమ్మబోతోంది. ఒక్కో షేరును రూ. 1,230 చొప్పున విక్రయించాలని భావిస్తున్నట్లు నేషనల్‌ మీడియాలో రిపోర్ట్స్‌ వచ్చాయి.

లార్సెన్ & టూబ్రో: 2024 సెప్టెంబర్‌లో ఎలక్ట్రోలైజర్ల వాణిజ్య విక్రయాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యూరోపియన్ పోటీ సంస్థల కంటే 50 శాతం తక్కువ ధరలో ఇది ఉండొచ్చు.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మూడేళ్లలో, బ్యాంక్‌ సురక్షిత రుణ పోర్ట్‌ఫోలియోను 40 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు బ్యాంక్‌ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్టిరా డేవిస్ చెప్పారు. ప్రస్తుతం, సెక్యూర్డ్ లోన్‌ పోర్ట్‌ఫోలియో 28.3 శాతంగా ఉంది.

బలరాంపూర్ చీని మిల్స్‌: పాలీ లాక్టిక్ యాసిడ్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించడానికి వచ్చే 30 నెలల వ్యవధిలో రూ. 2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్‌ సిద్ధం చేసింది. 

CIE ఆటోమోటివ్: 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో గట్టిగా తిప్పుకుంది, రూ. 169 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 658 కోట్ల నికర నష్టం వచ్చింది.

మాస్టెక్: 39,189 కంపల్సరీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లను, ఒక్కో షేరును రూ. 2,382 చొప్పున కేటాయించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: 5.06 మిలియన్ ఈక్విటీ షేర్ల కేటాయింపు & 7.50 మిలియన్ వారెంట్‌లను ఒక్కో షేరుకు రూ.169 చొప్పున ఈక్విటీ షేర్‌లుగా మార్చేందుకు ఈ నెల 22న కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కానుంది.

NBCC: రూ.3,690 కోట్ల విలువైన ఆర్డర్‌లు సాధించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్‌ కొనగలమా? - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget