Stocks Watch Today, 01 June 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Coal India, HDFC Life
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 01 June 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 40 పాయింట్లు లేదా 0.21 శాతం రెడ్ కలర్‌లో 18,624 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
సౌత్ ఇండియన్ బ్యాంక్: MD & CEO పోస్టుల కోసం కొత్త పేర్లను సౌత్ ఇండియన్ బ్యాంక్ ఖరారు చేసింది. ఆ అభ్యర్థులకు అనుమతి కోరుతూ ఆర్‌బీఐకి దరఖాస్తు చేయనుంది.
కోల్ ఇండియా: ఇవాళ (జూన్ 1, 2023), ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా కోల్ ఇండియాలో 3% వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
సెయిల్: కంపెనీ చైర్మన్‌గా అమరేందు ప్రకాష్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
లారస్ ల్యాబ్స్: సెల్, జీన్ థెరపీ కంపెనీ ఇమ్యునోయాక్ట్‌లో (ImmunoACT) తన పెట్టుబడిని లారస్ ల్యాబ్స్ పెంచింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత, ఇమ్యునోయాక్ట్‌లో లారస్ ల్యాబ్స్ వాటా 33.86% కు చేరుతుంది.
వేదాంత: ముంబై కేంద్రంగా పని చేస్తున్న మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ (Vedanta Resources), 400 మిలియన్ డాలర్ల రుణాలను చెల్లించి, తన మొత్తం అప్పులను 6.4 బిలియన్ డాలర్లకు తగ్గించినట్లు తెలిపింది.
గతి: కంపెనీ CEO పిరోజ్‌షా ఆస్పి ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసి, కుర్చీ దిగిపోయారు.
లుపిన్: ఒబెటికోలిక్ యాసిడ్ టాబ్లెట్‌ల కోసం లుపిన్ పెట్టుకున్న కొత్త డ్రగ్ అప్లికేషన్‌కు USFDA నుంచి ఆమోదం లభించింది.
టాటా స్టీల్: టాటా స్టీల్ అనుబంధ సంస్థ టాటా స్టీల్ మైనింగ్ (Tata Steel Mining), ఒక ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఫ్రెంచ్ కంపెనీ మెట్రోన్‌తో (Metron) ఒప్పందంపై సంతకం చేసింది.
HDFC లైఫ్: ప్రమోటర్ కంపెనీ Abrdn, బుధవారం నాడు బల్క్ డీల్స్ ద్వారా HDFC లైఫ్‌లో తన మొత్తం వాటాను ఆఫ్‌లోడ్ చేసింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ: రాబోయే రెండు వారాల్లో 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించే ప్రతిపాదనను అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్ కూడా వస్తాయ్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.