Stocks to watch 24 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Campusలో బ్లాక్ డీల్స్
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 24 March 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 25 పాయింట్లు లేదా 0.15 శాతం రెడ్ కలర్‌లో 17,058 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ITC: వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులకు కారణమవుతున్న హాట్‌స్పాట్‌లను గుర్తించడానికి క్లైమేట్-రిస్క్ మోడలింగ్‌కు వెళుతున్నట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ పూరి ప్రకటించారు. బిగ్ డేటా అనలిటిక్స్‌తో కూడిన మోడలింగ్‌లో నిపుణుల బృందం ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమై ఉందని చెప్పారు.
క్యాంపస్ యాక్టివ్‌వేర్: క్యాంపస్ యాక్టివ్‌వేర్ నుంచి పూర్తిగా నిష్క్రమించాలని అమెరికన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ TPG గ్లోబల్ యోచిస్తోంది. ఇందుకోసం తన మొత్తం 7.6% వాటాను ఈరోజు బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనుంది.
ఈ కంపెనీకి చెందిన 2,32,07,692 షేర్లను TPG విక్రయించనుంది, ఫ్లోర్ ధరను రూ. 345గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే దాదాపు 7% డిస్కౌంట్.
వేదాంత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5వ మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలించి, ఆమోదించేందుకు డైరెక్టర్ల బోర్డు మార్చి 28న సమావేశం కానుంది.
PNB హౌసింగ్ ఫైనాన్స్: రైట్స్ జారీ ద్వారా నిధుల సమీకరణను పరిశీలించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు మార్చి 28న సమావేశమవుతుంది.
మారుతీ సుజుకి: పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి కార్ల ధరలను పెంచాలని ఈ కంపెనీ నిర్ణయించింది, కొత్త ధరలు ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తాయి.
LIC: ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో, ఈ జీవిత బీమా సంస్థ చైర్‌పర్సన్ పదవికి సిద్ధార్థ మొహంతిని సిఫార్సు చేసింది.
మెట్రో బ్రాండ్స్: తన పూర్తి యాజమాన్యంలో ఉన్న సంస్థ FILAని డీమెర్జ్ చేయాలని మెట్రో బ్రాండ్స్ నిర్ణయించుకుంది. FILA వ్యాపార వృద్ధి కోసం అనుసరించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ ఎలక్ట్రానిక్స్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం మీడియం పవర్ రాడార్, డిజిటల్ రాడార్ వార్నింగ్ రిసీవర్ సరఫరా కోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ. 3,800 కోట్ల విలువైన 2 ఒప్పందాలను దక్కించుకుంది.
రైల్ వికాస్ నిగమ్: గుజరాత్‌లో ఒక హైవేను అప్‌గ్రేడ్ చేయడానికి 250 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌ను జాయింట్ వెంచర్ రచన-ఆర్‌వీఎన్‌ఎల్ పొందింది. మధ్యంతర డివిడెండ్ చెల్లింపును పరిశీలించేందుకు ఈ కంపనీ బోర్డు ఈరోజు సమావేశం కానుంది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్: ప్రభుత్వం ప్రకటించిన 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) రిటైల్ ఇన్వెస్టర్లకు సబ్‌స్క్రిప్షన్ కోసం ఇవాళ ఓపెన్ అవుతుంది. సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి గురువారం అధిక స్పందన వచ్చింది, వాళ్ల పోర్షన్ 226% సబ్‌స్క్రైబ్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.