Stocks to watch 03 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో Adani Stocks, YES Bank
మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 03 March 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 107 పాయింట్లు లేదా 0.62 శాతం గ్రీన్ కలర్‌లో 17,462 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్: అదానీ గ్రూప్ ప్రమోటర్ అయిన ఎస్‌బి అదానీ ఫ్యామిలీ ట్రస్ట్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో రూ. 15,446 కోట్ల విలువైన 21 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించింది.
అదానీ పోర్ట్స్: అదానీ పోర్ట్స్ ఏప్రిల్-ఫిబ్రవరిలో 26.5 mmt కార్గోను నిర్వహించింది, అంతకుముందు ఇదే కాలం కంటే ఇది 10% ఎక్కువ. ఏప్రిల్-ఫిబ్రవరిలో కార్గో వాల్యూమ్‌లు 307 mmt వద్ద ఉన్నాయి.
M&M ఫైనాన్షియల్ సర్వీసెస్: 2023 ఫిబ్రవరిలో రూ. 4,185 కోట్ల డిస్‌బర్స్‌మెంట్లను M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదించింది, ఫిబ్రవరి 2022తో పోలిస్తే 53% వృద్ధిని అందించింది. రుణాల వసూలు సామర్థ్యం (collection efficiency) ఫిబ్రవరి 2023లో 97% గా ఉంటే, ఫిబ్రవరి 2022 లో 98% సాధించింది.
హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDs) మూడు విడతలుగా జారీ చేయడం ద్వారా రూ. 125 కోట్ల వరకు నిధులను సేకరించేందుకు హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
నాట్కో ఫార్మా: ఈక్విటీ షేర్ల బైబ్యాక్ చేసే ఆలోచనలో ఉంది, దీనిపై చర్చించేందుకు మార్చి 8న నాట్కో ఫార్మా బోర్డు సమావేశం కానుంది.
SBI, యస్ బ్యాంక్: యస్ బ్యాంక్‌లో మార్చి 13తో ఎస్‌బీఐ లాక్-ఇన్ పీరియడ్ ముగుస్తుందని, ఆ తర్వాత యెస్ బ్యాంక్‌లో తన వాటాను ఎస్‌బీఐ తగ్గించుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది.
ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్: ముంబైలోని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ గురువారం అర్ధరాత్రి దాడులు నిర్వహించింది.
PVR: ఐనాక్స్‌తో విలీనం తర్వాత కొత్త స్క్రీన్‌లతో పాటు కంపెనీ కోసం సుమారు రూ. 450-500 కోట్లు ఖర్చు చేయడానికి మల్టీప్లెక్స్ చైన్ ఆపరేటర్ PVR యోచిస్తోంది. ప్రతి సంవత్సరం 200 స్క్రీన్‌లను జోడించాలని, చిన్న మార్కెట్‌ను కూడా క్యాప్చర్ చేయాలని చూస్తోంది.
జైడస్ లైఫ్ సైన్సెస్: Acyclovir క్రీమ్‌ను అమెరికాలో మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) నుంచి జైడస్ లైఫ్‌సైన్సెస్ తుది ఆమోదం పొందింది, ఇది యాంటీవైరల్ విభాగానికి చెందిన క్రీమ్.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.