అన్వేషించండి

Stock Market News: బెంచ్‌ మార్క్‌ సూచీలకు మళ్లీ నష్టాలు! సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌!

Stock Market Closing Bell on 31 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,584 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 359 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Stock Market Closing Bell on 31 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచే మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఐరోపా, ఆసియా సూచీలు సపోర్ట్‌ తీసుకోవడంతో భారత మార్కెట్లు రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,584 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 359 పాయింట్ల నష్టాల్లో ముగిసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 55,925  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,622 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఆరంభం నుంచే అమ్మకాల జోరు కనిపించింది. 55,369 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 359 పాయింట్ల నష్టంతో 55,566 వద్ద కొనసాగుతోంది. ఒకానొక దశలో లాభాల్లోకి వచ్చిన సూచీ ఆఖరి అరగంటలో పతనమైంది.

NSE Nifty

సోమవారం 16,661 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,578 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. 16,521 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,690 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తానికి 76 పాయింట్ల నష్టంతో 16,584 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,615 వద్ద మొదలైంది. 35,288 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,881 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 339 పాయింట్ల నష్టంతో 35,487 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం, కోల్‌ ఇండియా, టాటా కన్జూమర్‌ షేర్లు లాభపడ్డాయి. కొటక్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, శ్రీసెమ్‌ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ నెక్ట్స్‌ 50, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌, స్మాల్‌ క్యాప్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ బ్యాంక్‌, ఫైనాన్షియల్స్‌, ఐటీ, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌లో సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపించింది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget