(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Update: శుక్రవారం ఎర్రబారింది! సెన్సెక్స్ 764, నిఫ్టీ 204 డౌన్
స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాల సూచీలూ ఎర్రబారాయి.
రెండు రోజుల వరుస లాభాలకు చెక్ పడింది! ఉదయం ఊగిసలాడిన బెంచ్‌మార్క్ సూచీలు మధ్యాహ్నం నుంచి నేల చూపులు చేశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అన్ని సెక్టార్ల సూచీలు ఎర్రబారడంతో వారంతం నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,000 దిగువన ముగిసింది.
క్రితం రోజు 58,461 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ శుక్రవారం 58,555 వద్ద లాభాల్లోనే మొదలైంది. కొనుగోళ్లు కొనసాగడంతో 12 గంటల సమయంలో ఇంట్రాడే గరిష్ఠమైన 58,754ను తాకింది. అక్కడి నుంచి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 57,640 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 764 పాయింట్ల నష్టంతో 57,696 వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీదీ ఇదే దారి. నిన్నటి ముగింపు 17,401తో పోలిస్తే నేడు 17,242 వద్ద మొదలైంది. మరికాసేపటికే 17,489 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. క్రమంగా పతనం అవుతూ 17,180 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరికి 204 పాయింట్ల నష్టంతో 17,196 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ మాత్రం తీవ్రంగా ఒడుదొడుకులకు లోనైంది. ఉదయం 36,497 వద్ద మొదలైన సూచీ కాసేపటికే 36,844 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. వెంటనే అమ్మకాలు కొనసాగడంతో 36,062 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకొంది. చివరికి 311 పాయింట్ల నష్టంతో 36,197 వద్ద ముగిసింది.
నిఫ్టీలో యూపీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సెమ్ లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్, రిలయన్స్, కొటక్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాల సూచీలు పతనం అయ్యాయి.
Also Read: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!
Also Read: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుంటే పన్ను పడతాది!
Also Read: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్ తెలుసా?
Also Read: ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!
Also Read: త్వరపడండి..! ఈ గవర్నమెంట్ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.77% వడ్డీ ఇస్తోంది
Also Read: కస్టమర్లకు బ్యాంకుల షాక్..! ఏటీఎం లావాదేవీల ఫీజు పెంపు
Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!