By: ABP Desam | Updated at : 02 Dec 2021 07:31 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Money
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీని ఆశిస్తున్న వారికి శుభవార్త! ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఏకంగా 8.77 శాతం వడ్డీని అందిస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతూ వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో ఇదో మంచి అవకాశం. ఎందుకంటే తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TN Power Finance) అందిస్తోంది మరి!
నాన్ క్యుములేటివ్ విధానంలో సీనియర్ సిటిజన్ల కోసం 24, 36, 60 నెలల కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నెలవారీ, మూడు నెలలు, ఏడాదికి వడ్డీ కావాలనుకుంటే వరుసగా 7.50%, 8.25%, 8.50% వడ్డీని జమ చేస్తారు.
క్యుములేటివ్ విధానంలో సాధారణ పౌరులకు ఏడాదికి 7, మూడేళ్లకు 7.75, నాలుగేళ్లకు 7.75, ఐదేళ్లకు 8.00 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్లకు వరుసగా 7.25, 8.25, 8.25, 8.50 శాతం వడ్డీని జమ చేస్తారు.
ప్రస్తుతం బ్యాంకులు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6 శాతానికి మించి వడ్డీ ఇవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ 8 శాతం వడ్డీ అందిస్తుండం గమనార్హం. టీఎన్ పవర్‌కు సంబంధించిన యాప్ లేదా ఆన్‌లైన్ విధానంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయొచ్చు. కాగా ఇందులో డిపాజిట్లు చేసేందుకు జనాలు ఎగబడుతున్నారని తెలిసింది. కంపెనీ యాప్ సైతం చాలా బాగుందని నిపుణులు అంటున్నారు.
టీఎన్ పవర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఇబ్బందేమీ లేదని వెల్లడిస్తున్నారు. బ్యాంకు వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో ఇదో మంచి పెట్టుబడి సాధనమని వివరిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ఇదో బెటర్ ఆపర్చునిటీగా వర్ణిస్తున్నారు.
Also Read: December Financial Changes: డిసెంబర్లో డబ్బు పరంగా జరిగే మార్పులివే..! లేదంటే..!
Also Read: GST Collections: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!
Also Read: GST on Salary: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుంటే పన్ను పడతాది!
Also Read: SBI ATM Withdrawal Rule: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్ తెలుసా?
Also Read: Banks Money : ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి