Share Market Today: మంటబెట్టిన యాక్సెంచర్ - ఐటీ స్టాక్స్ పతనంతో మార్కెట్లు బలహీనం
Share Market Open Today: భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు బలహీనంగా ప్రారంభమైంది. ట్రేడ్ స్టార్టయిన వెంటనే ఐటీ స్టాక్స్‌లో భారీ పతనం కనిపించింది.
Stock Market News Updates Today in Telugu: ఐటీ సెక్టార్ జారుడుబల్లపై ఉండడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (బుధవారం, 18 సెప్టెంబర్ 2024) బలహీనంగా ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే, ఐటీ సెక్టార్‌లోని షేర్లు జారిపోవడం మొదలుపెట్టాయి. హీరో మోటోకార్ప్, యునైటెడ్ స్పిరిట్స్ 52-వారాల కొత్త గరిష్ట స్థాయిని తాకాయి. BSE షేర్లు ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. HDFC బ్యాంక్ షేర్లు ప్రారంభ నిమిషాల్లో లాభాలు సాధించాయి.
యూఎస్ ఫెడ్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. వడ్డీ రేట్లు సహా కీలక ఆర్థిక విషయాలపై ఫెడ్ నిర్ణయాలు ఈ రోజు అర్ధరాత్రి సమయంలో (భారతదేశ కాలమానం ప్రకారం) వెలువడతాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (సోమవారం) 83,079 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 42.52 పాయింట్ల పతనంతో 83,037.13 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 25,418 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 16.15 పాయింట్లు తగ్గి 25,402.40 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
సెన్సెక్స్ షేర్ల అప్‌డేషన్
మార్కెట్ ప్రారంభమైన దాదాపు అరగంట తర్వాత, ఉదయం 9.40 గంటలకు, BSE సెన్సెక్స్ షేర్లలో కాస్త పచ్చదనం కనిపించింది. పతనమైన షేర్లలో ఐటీ షేర్లలో వాటా ఎక్కువగా ఉంది. ఈరోజు ఐటీ షేర్లు క్షీణించడం వెనుక యాక్సెంచర్ ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఐటీ ఇండెక్స్ దాదాపు 2.50 శాతం ఆవిరైంది.
నిఫ్టీ షేర్ల స్టేటస్
ఉదయం 9.40 గంటలకు, NSE నిఫ్టీ 50 ప్యాక్‌లో 32 షేర్లు లాభపడగా, 18 షేర్లు నష్టంలో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ టాప్-5 గెయినర్స్‌లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, టాటా మోటార్స్ చోటు సంపాదించాయి.
FMCG షేర్లలో కొనసాగుతున్న అప్‌ట్రెండ్
ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ షేర్లను పరిశీలిస్తే... ఐటీసీ, హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే షేర్లు పుంజుకున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ నుంచి మార్కెట్‌కు మద్దతు
ఉదయం 9.52 గంటలకు, సెన్సెక్స్ గ్రీన్ జోన్‌లోకి తిరిగి వచ్చింది. నిఫ్టీ కూడా 25400 పైన ఉంది, మంగళవారం ముగింపు స్థాయి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఈ సమయానికి, బ్యాంక్ నిఫ్టీ నుంచి మార్కెట్‌కు స్పష్టమైన మద్దతు, ఉపశమనం లభించాయి. ఐటీ షేర్ల పతనం వల్ల మార్కెట్ దిగజారకుండా బ్యాంక్ షేర్లు అడ్డుకున్నాయి. నేడు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా చాలా ప్రైవేట్ బ్యాంకుల షేర్లు బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 11 షేర్లు పెరుగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ మాత్రమే క్షీణతలో కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం 10.25 గంటలకు, BSE సెన్సెక్స్ 15.64 పాయింట్లు లేదా 0.01% పెరిగి 83,095.30 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 3.95 పాయింట్లు లేదా 0.01% పడిపోయి 25,414.60 దగ్గర ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: షాక్ ఇస్తున్న ముడి చమురు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి