Stock Market News: ఎనలిస్ట్‌లు 'బయ్' టిప్ ఇచ్చిన 5 బెస్ట్ స్టాక్స్, త్వరలోనే లాభాలు ఖాయమట!
సమీప కాలంలో మంచి రాబడిని అందించగలని వాళ్లు భావిస్తున్న 5 స్టాక్స్ ఇవి.
Stock Market News: ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్ల కారణంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు కొత్త గరిష్టాల వద్ద కదులుతున్నాయి. రెండు ప్రధాన సూచీలు (సెన్సెక్స్, నిఫ్టీ ) ఈ జోరును కొనసాగించే అవకాశం ఉందని, మరికొన్ని స్టాక్స్ కూడా త్వరలోనే జోష్ పార్టీలో చేరవచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. సమీప కాలంలో మంచి రాబడిని అందించగలని వాళ్లు భావిస్తున్న 5 స్టాక్స్ ఇవి:
ఎనలిస్ట్: వైశాలి పరేఖ్, ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ రీసెర్చ్‌కు వైస్ ప్రెసిండెంట్
మహీంద్ర & మహీంద్ర (Mahindra & Mahindra)
ఎనలిస్ట్ సిఫార్సు: బయ్
టార్గెట్ ధర: రూ. 1,380
స్టాప్ లాస్: రూ. 1,200
టైలీ ఛార్ట్‌లో.. చిన్న కరెక్షన్ తర్వాత, గత కనిష్ట స్థాయి రూ. 1200 దగ్గర మళ్లీ సపోర్ట్ తీసుకుని డబుల్ బాటమ్ ఫామ్ చేసింది.
గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (Godrej Consumer Products)
ఎనలిస్ట్ సిఫార్సు: బయ్
టార్గెట్ ధర: రూ. 950
స్టాప్ లాస్: రూ. 810
ఇటీవలి కరెక్షన్ తర్వాత, రూ. 810 వద్ద ఉన్న 200 DMA దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడి నుంచి పుల్‌బ్యాక్ కనిపిస్తోంది.
సుమిటోమో కెమికల్స్ (Sumitomo Chemicals)
ఎనలిస్ట్ సిఫార్సు: బయ్
టార్గెట్ ధర: రూ. 530
స్టాప్ లాస్: రూ. 445
ఇటీవలి డీసెంట్ కరెక్షన్ తర్వాత, రూ. 445 వద్ద ఉన్న 200 DMA దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడి కన్సాలిడేట్ అవుతోంది, మంచి పుల్‌బ్యాక్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి.
ఎనలిస్ట్: రాఖేష్ బన్సల్, ఐయాంరాకేష్‌బన్సల్.డామ్ ఫౌండర్
టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services -TCS)
ఎనలిస్ట్ సిఫార్సు: బయ్
టార్గెట్ ధర: రూ. 3,500
స్టాప్ లాస్: రూ. 3,300
దీర్ఘకాల కరెక్షన్ తర్వాత ఈ స్టాక్‌లో క్షీణత ఆగింది. ప్రస్తుతం కన్సాలిడేషన్ మోడ్‌లో ఉంది. రూ. 3,500 టార్గెట్ కోసం ప్రస్తుత స్థాయి దగ్గర TCS షేర్లను కొనవచ్చు.
బ్రిటానియా ఇండస్ట్రీస్ (Britannia Industries)
ఎనలిస్ట్ సిఫార్సు: బయ్
టార్గెట్ ధర: రూ. 4,600
స్టాప్ లాస్: రూ. 4,000
ఈ FMCG మేజర్ ఇటీవలి కరెక్షన్‌ను ముగించుకుని ప్రస్తుతం యాక్షన్ ఫేజ్‌లోకి వచ్చింది. మార్జిన్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడవుతున్న ఒకే ఒక్క FMCG కంపెనీ ఇది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.