అన్వేషించండి

Holiday: సంక్రాంతి సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌కు సోమవారం సెలవు ఇచ్చారా?

ఈ ఏడాది ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు మొత్తం 14 రోజులు సెలవులు (non-trading days) వచ్చాయి.

Stock Market Holidays in 2024: భారతదేశంలోని అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. క్యాలెండర్‌ ఇయర్‌లో మొదట వచ్చే పండుగ ఇదే. ఈ ఏడాది (2024), ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు మొత్తం 14 రోజులు సెలవులు (Non-trading days) వచ్చాయి. ఈ 14 రోజుల్లో.. శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, రంజాన్‌ వంటి పండుగలతో పాటు... గణతంత్ర దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి వంటి జాతీయ సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఈ ఏడాది, సోమవారం (14 జనవరి 2024) నాడు సంక్రాంతి వచ్చింది. అయితే, సంక్రాంతి రోజున మార్కెట్లకు సెలవు (Makar Sankranti Holiday 2024) లేదు, ఆ రోజున మార్కెట్‌లో యథావిధిగా ట్రేడ్‌ జరుగుతుంది. క్యాష్‌ మార్కెట్‌, ఫ్యూచర్స్‌ & ఆప్షన్స్‌ (F&O), కమొడిటిస్‌ మార్కెట్‌ అన్నీ మాముూలు సమయం ప్రకారమే ప్రారంభమవుతాయి, క్లోజ్‌ అవుతాయి.

2024లో, జనవరి 26న, గణతంత్ర దినోత్సవంతో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా స్టార్ట్‌ అవుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో గరిష్టంగా మూడు నాన్-ట్రేడింగ్ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత... ఏప్రిల్‌, నవంబర్‌ నెలల్లో రెండు రోజుల చొప్పున సెలవులు వచ్చాయి. వీకెండ్స్‌ తప్ప, ఫిబ్రవరి, సెప్టెంబర్‌ నెలల్లో ఒక్క హాలిడే కూడా లేదు.

2024 క్యాలెండర్‌ ఇయర్‌లో హాలిడేస్‌ లిస్ట్‌ను NSE విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో 14 నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌తో పాటు వారాంతాల్లో (శని, ఆదివారాలు) వచ్చే మరో ఐదు సెలవులు ఉన్నాయి. ఈ జాబితా క్యాపిటల్ మార్కెట్లు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) విభాగాలకు కూడా వర్తిస్తుంది.

2024లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇది ‍‌(Stock market holiday 2024):

1. జనవరి 26, 2024 (శుక్రవారం) - గణతంత్ర దినోత్సవం
2. మార్చి 08, 2024 (శుక్రవారం) - మహాశివరాత్రి
3. మార్చి 25, 2024 (సోమవారం) - హోలీ
4. మార్చి 29, 2024 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే
5. ఏప్రిల్ 11, 2024 (గురువారం) - ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ ఈద్)
6. ఏప్రిల్ 17, 2024 (బుధవారం) - శ్రీరామ నవమి
7. మే 01, 2024 (బుధవారం) - మహారాష్ట్ర దినోత్సవం
8. జూన్ 17, 2024 (సోమవారం) - బక్రీద్
9. జులై 17, 2024 (బుధవారం) - మొహర్రం
10. ఆగస్టు 15, 2024 (గురువారం) - స్వాతంత్ర్య దినోత్సవం
11. అక్టోబర్ 02, 2024 (బుధవారం) - మహాత్మాగాంధీ జయంతి
12. నవంబర్ 01, 2024 (శుక్రవారం) - దీపావళి లక్ష్మి పూజ
13. నవంబర్ 15, 2024 (శుక్రవారం) - గురునానక్ జయంతి
14. డిసెంబర్ 25, 2024 (బుధవారం) - క్రిస్మస్

2024లో, దీపావళి సందర్భంగా ముహూరత్‌ ట్రేడింగ్ (Muhurat Trading Timings in 2024) నవంబర్ 1వ తేదీ, శుక్రవారం రోజున ఉంటుంది. ఆ రోజున, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ప్రత్యేక ట్రేడింగ్‌ జరుగుతుందన్న విషయాన్ని స్టాక్‌ మార్కెట్లు తర్వాత ప్రకటిస్తాయి.

పైన చెప్పిన 14 రోజుల హాలిడేస్‌తో పాటు, శని & ఆదివారాల్లో మరో ఐదు సెలవులు వచ్చాయి. అవి:

1. ఏప్రిల్ 14, 2024 (ఆదివారం) - డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
2. ఏప్రిల్ 21, 2024 (ఆదివారం) - మహావీరుడి జయంతి
3. సెప్టెంబర్ 07, 2024 (శనివారం) - వినాయక చవితి
4. అక్టోబర్ 12, 2024 (శనివారం) - దసరా
5. నవంబర్ 02, 2024 (శనివారం) - దీపావళి

ఈ నెల చివరిలో లాంగ్‌ వీకెండ్‌ ఉండబోతోంది. క్రిస్మస్ (Christmas Holiday) సందర్భంగా 25వ తేదీన (సోమవారం) స్టాక్ మార్కెట్లు పని చేయవు. దీనికి ముందున్న శని, ఆదివారాలను కలిపితే, వరుసగా 3 రోజులు మార్కెట్లకు సెలవులు వచ్చాయి.

మరో ఆసక్తికర కథనం: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget