Share Market Closing Today: స్టాక్ మార్కెట్లలో రికార్డ్‌ల మోత - సెన్సెక్స్ 1360 pts, నిఫ్టీ 375 pts జంప్
Sensex And Nifty At Fresh All-time High: స్టాక్ మార్కెట్ దూకుడు కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.6.50 లక్షల కోట్లు పెరిగింది, మార్కెట్ క్యాప్ ఆల్ టైమ్ హై రూ.471.97 లక్షల కోట్ల వద్ద ముగిసింది.
Stock Market Closing On 20 September 2024: వారంలో చివరి రోజు (శుక్రవారం, 20 సెప్టెంబర్ 2024) మన మార్కెట్లకు ఎదురే లేకుండాపోయింది. మధ్యాహ్నం, యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అయిన టైమ్‌లో, మన మార్కెట్లు ట్రేడర్లను కాస్త కంగారు పెట్టినప్పటికీ, చివరకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ స్టాక్స్‌లో దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో మార్కెట్‌లో దూకుడు పెరిగింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి తిరిగి ఊపందుకున్నాయి. వీటన్నింటి సపోర్ట్‌తో... దలాల్ స్ట్రీట్ చరిత్రలో తొలిసారిగా BSE సెన్సెక్స్ 84,000 మార్క్‌ను దాటగా, NSE నిఫ్టీ కూడా పాత రికార్డ్‌లు బద్ధలు కొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ రోజు సాగిన ప్రయాణంలో భారతీయ షేర్ మార్కెట్లు 1% పైగా లాభాలతో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి (Stock markets at record levels) చేరాయి.
ఇంట్రా-డే ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్ తాజా జీవితకాల గరిష్ట స్థాయి 84,694.46 ని (Sensex at fresh all-time high) క్రియేట్ చేసింది. NSE నిఫ్టీ కూడా 25,849.25 (Nifty at fresh all-time high) వద్ద లైఫ్‌టైమ్ హైని టచ్ చేసింది.
ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,359.52 పాయింట్లు లేదా 1.63% పెరిగి 84,544.31 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 375.15 పాయింట్లు లేదా 1.48% లాభంతో 25,790.95 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 83,359.17 వద్ద, నిఫ్టీ 25,487.05 వద్ద ఓపెన్ అయ్యాయి.
పెరిగిన & పడిపోయిన షేర్లు
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 26 షేర్లు లాభాలతో, 4 షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 43 స్టాక్స్ ప్రాఫిట్స్‌తో, 7 స్టాక్స్ లాసుల్లో క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్‌లో... మహీంద్రా అండ్ మహీంద్రా 5.57 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.77 శాతం, జేఎస్‌డబ్ల్యు స్టీల్ 3.66 శాతం, ఎల్ అండ్ టీ 3.07 శాతం, భారతి ఎయిర్‌టెల్ 2.84 శాతం, నెస్లే 2.49 శాతం, అదానీ పోర్ట్స్ 2.49 శాతం, హెచ్‌యూఎల్ 2.99 శాతం పెరిగాయి. టాప్ లూజర్స్‌లో... ఎస్‌బీఐ 1.07 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.33 శాతం, టీసీఎస్ 0.27 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.07 శాతం పతనంతో ముగిశాయి.
BSEలో మొత్తం 4,059 షేర్లు ట్రేడ్ అవగా... వాటిలో 2,442 షేర్లు లాభాలతో, 1,501 షేర్లు నష్టాలతో ముగిశాయి. 116 స్టాక్స్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
సెక్టార్ల వారీగా చూస్తే..
నేటి ట్రేడింగ్‌లో అన్ని రంగాలు పచ్చగా స్థిరపడ్డాయి. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటీ, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా గెయిన్ అయ్యాయి.
మార్కెట్ క్యాప్
స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు వచ్చిన వసంతం కారణంగా పెట్టుబడిదార్ల సంపద సుమారు రూ.7 లక్షల కోట్లు పెరిగింది. గత సెషన్‌లో రూ.465.47 లక్షల కోట్ల వద్ద ముగిసిన బీఎస్‌ఈలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్, ఈ రోజు (market capitalization of indian stock market) రూ.471.97 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అంటే, నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.6.50 లక్షల కోట్లు పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టర్మ్ ఇన్సూరెన్స్‌ల్లో 'ఆమె' హవా - టాప్ ప్లేస్‌లో హైదరాబాద్, గుంటూరు లేడీస్