అన్వేషించండి

Penny Stocks: పెన్నీ స్టాక్స్‌ అంటే ఫన్నీ అనుకుంటివా? పవర్‌ఫుల్‌ స్టాక్స్‌ - డబ్బుల వర్షం కురిపించాయి

ఈ 12 కౌంటర్లలో 7 కౌంటర్లు FY24లో (ఏప్రిల్‌ 1 నుంచి) ఇప్పటి వరకు రెండంకెల లాభాలతో కళకళలాడుతున్నాయి.

FII-backed Penny Stocks: స్టాక్‌ మార్కెట్‌లో రిస్క్‌ ఎక్కువ అనుకుంటే, ఆ రిస్క్‌ను పీక్‌ స్టేజ్‌లోకి తీసుకెళతాయి పెన్నీ స్టాక్స్‌. అదే సమయంలో, ఇన్వెస్టర్లను అత్యంత వేగంగా ధనవంతుల్ని చేసేవి కూడా ఇవే. పేరుమోసిన పెట్టుబడిదార్లు కూడా పెన్నీ స్టాక్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కూడా కూడా ఇందుకు మినహాయింపు కాదు, వాళ్ల చేతుల్లోనూ పెన్నీ స్టాక్స్‌ ఉంటాయి. అయితే, ఇవి హై రిస్కీ స్కీమ్స్‌ కాబట్టి సీరియస్‌గా ఓ కన్నేసి ఉంచుతారు.

మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,000 కోట్ల కంటే తక్కువ, షేర్‌ ధర రూ. 25 కంటే తక్కువ ఉన్న డజను పెన్నీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలకు 10% వాటా ఉంది. ఈ 12 కౌంటర్లలో 7 కౌంటర్లు FY24లో (ఏప్రిల్‌ 1 నుంచి) ఇప్పటి వరకు రెండంకెల లాభాలతో కళకళలాడుతున్నాయి.

FY24లో రెండంకెల రిటర్న్స్‌ ఇచ్చిన 7 పెన్నీ స్టాక్స్‌:

1) గ్లోబస్ పవర్ జనరేషన్
జైపుర్‌కు చెందిన క్లీన్ ఎనర్జీ కంపెనీ గ్లోబస్ పవర్ జనరేషన్‌లో, గత నాలుగు త్రైమాసికాలుగా (ఏడాది కాలం) ఎఫ్‌ఐఐల వాటా దాదాపు 18%తో స్థిరంగా ఉంచింది. FY24లో ఇప్పటి వరకు ఈ స్టాక్ దాదాపు 64% ర్యాలీ చేసింది. ఈ కంపెనీ షేర్లు కొన్న ఫారిన్‌ పెట్టుబడిదార్లలో ఎల్మ్ పార్క్ ఫండ్, ఆరెస్ డైవర్సిఫైడ్, ఇయోస్ మల్టీ-స్ట్రాటజీ ఫండ్ ఉన్నాయి.

2) నెక్టార్ లైఫ్ సైన్సెస్
చండీగఢ్‌ హెడ్‌ క్వార్టర్‌గా పని చేస్తున్న ఫార్మా కంపెనీ నెక్టర్ లైఫ్‌సైన్సెస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 56% ర్యాలీ చేసింది. ఈ కంపెనీలో, జూన్‌ క్వార్టర్‌ చివరి నాటికి, 16% స్టేక్‌ ఎఫ్‌ఐఐల ఆధీనంలో ఉంది. కానీ, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ 1% కంటే తక్కువగా ఉంది.

3) విసా స్టీల్
కోల్‌కతాకు చెందిన వీసా స్టీల్‌లో FII యాజమాన్యం, గత 4 త్రైమాసికాల్లో 21.95% వద్ద స్టేబుల్‌గా కంటిన్యూ అవుతోంది. FY24లో ఇప్పటి వరకు ఈ స్టాక్ 53% పైగా ర్యాలీ చేసింది. అప్పులు తిరిగి తీర్చలేక గత ఏడాది నవంబర్‌లో NCLT గడప తొక్కింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియానికి ఈ కంపెనీ రూ.3,400 కోట్లు బకాయి ఉంది. 

4) ధనలక్ష్మి బ్యాంక్
జూన్ త్రైమాసికంలో రూ. 28 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌తో లాభాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ సెక్టార్‌ లెండర్‌ ధనలక్ష్మి బ్యాంక్, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46% ర్యాలీ చేసింది. జూన్ చివరి నాటికి ఈ కంపెనీలో ఎఫ్‌ఐఐలకు దాదాపు 11% వాటా ఉంది.

5) సంపన్ ఉత్పాదన్ ఇండియా
విండ్‌ ఎనర్జీ నుంచి విద్యుత్‌, టైర్‌ వ్యర్థాల నుంచి రబ్బర్‌ను వెలికితీసే బిజినెస్‌ చేస్తున్న సంపన్ ఉత్పాదన్ ఇండియా, YTD దాదాపు 35% పుంజుకుంది. ఈ కంపెనీలో 12.21% వాటా FII యాజమాన్యంలో ఉంది.

6) వికాస్ ఎకోటెక్
ప్లాస్టిక్ & రబ్బర్ పరిశ్రమలకు స్పెషాలిటీ పాలిమర్స్‌, స్పెషాలిటీ అడిటివ్స్‌, కెమికల్స్‌ విక్రయించే వికాస్ ఎకోటెక్ మార్కెట్‌ విలువ ఈ ఆర్థిక సంవత్సరంలో 23% పెరిగింది. మార్చి క్వార్టర్‌లో చాలా స్వల్పంగా ఉన్న FII ఓనర్‌షిప్‌ ఇప్పుడు 15% దాటింది. సంప్రదాయ ఇంధన రంగంలోకి ఇటీవలే అడుగు పెట్టింది, సిమెంట్ తయారీ కంపెనీ ప్రిజం జాన్సన్ నుంచి రూ. 20 కోట్ల బొగ్గు సరఫరా ఆర్డర్‌ అందుకుంది.

7) యారీ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్
ఇండియాబుల్స్ గ్రూప్ పెట్టుబడులు ఉన్న సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ యారీ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్‌లో, జూన్ త్రైమాసికంలో, FIIలకు 11.66% వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ స్టాక్ 20% పైగా లాభాలు ఇచ్చింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.130 కోట్ల లోపే ఉంది.

మరో ఆసక్తికర కథనం:వెండి కొనాలంటే మంచి ఛాన్స్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget