అన్వేషించండి

Gold: బంగారంపై బంపర్‌ డిస్కౌంట్‌, శుక్రవారం వరకే ఆఫర్‌, 4 కిలోలు కొనే ఛాన్స్‌

ఈ ఆఫర్‌ 5 రోజుల పాటు, శుక్రవారం వరకే అందుబాటులో ఉంటుంది.

Sovereign Gold Bond Scheme 2023-24: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లకు గుడ్‌ న్యూస్‌. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లో బంపర్‌ డిస్కౌంట్‌ నేటి (సోమవారం, 19 జూన్‌ 2023) నుంచి ప్రారంభమైంది. RBI సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఫస్ట్‌ సిరీస్‌ కింద, తక్కువ రేటుకే స్వర్ణాన్ని కైవసం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ 5 రోజుల పాటు, శుక్రవారం వరకే అందుబాటులో ఉంటుంది. 

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో 999 కేరట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొవచ్చు. గ్రాము బంగారం రేటును రూ. 5,926 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్ తేదీకి ముందున్న మూడు పని దినాల్లో, 999 కేరట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఇష్యూ ప్రైస్‌ను నిర్ణయించింది.

ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌
బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసి, డిజిటల్‌ మోడ్‌లో డబ్బులు చెల్లిస్తే ఒక్కో గ్రాముకు రూ. 50 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ పద్ధతి ఫాలో అయినవాళ్లకు గ్రాము బంగారం రూ. 5,876 కే దక్కుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సెకండ్‌ సిరీస్‌ను సెప్టెంబర్‌లో జారీ చేస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి?
బంగారాన్ని భౌతిక రూపంలో ఇంట్లో ఉంచుకోవడానికి ప్రజలు సంకోచిస్తారు. దొంగల భయంతో నిద్ర పట్టదు. ఈ అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB Scheme). కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిని జారీ చేస్తుంది. బంగారంలో మదుపు చేయాలనుకనే వాళ్లు ఈ గోల్డ్‌ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, గోల్డ్‌ బాండ్లను ఆర్‌బీఐ వద్ద భద్రంగా ఉంచుకోవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు.

ఒక్కో గోల్డ్‌ బాండ్‌ కాల పరిమితి 8 సంవత్సరాలు. గోల్డ్ బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, ఈ బాండ్లను 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు. ఆ రోజు ఉన్న రేటుకు బాండ్లను అమ్మవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనాలి?
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SHCIL)‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలు పొందవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? 
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్‌ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం?
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(కూపన్‌ రేట్‌) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు.

ఎంత బంగారం కొనవచ్చు?
గోల్డ్‌ బాండ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు (Hindu Undivided Family) కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.

ఫిజికల్‌ గోల్డ్ కొనే సమయంలో వర్తించే KYC (Know-your-customer) రూల్సే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ విషయంలోనూ వర్తిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: రూ.30 వేలకు మించి డిపాజిట్ చేస్తే అకౌంట్‌ ఫ్రీజ్‌ చేస్తారా? 

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget