అన్వేషించండి

Nifty 50: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య US బాంబు దాడులతో భారతీయ స్టాక్ మార్కెట్ కుదేలు

Nifty 50: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రత మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్‌ను మరింత పెంచింది.

Nifty 50: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం మధ్యలో అమెరికా జోక్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలాయి. వారంలోని మొదటి ట్రేడింగ్ రోజు భారీ పతనంతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 700 పాయింట్లు పడిపోయింది. NSE నిఫ్టీ కూడా 182.90 పాయింట్లు తగ్గి 24,929.50 వద్ద ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ షేర్లలో 2 శాతం క్షీణత కనిపించింది.

గత వారం భారత మార్కెట్లు చాలా స్థిరంగా పెరుగుదలను సూచించాయి. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత ఈక్విటీలు గత వారం పాజిటివ్‌గా ముగిశాయి. శుక్రవారం, బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,046.30 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 82,408.17 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 319.15 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 25,112.40 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 1,289.57 పాయింట్లు (1.58 శాతం) లాభపడింది.  నిఫ్టీ 393.8 పాయింట్లు (1.59 శాతం) జోడించింది, ఇది మధ్యప్రాచ్య ఆందోళనల మధ్య కూడా స్థిరమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను సూచిస్తుంది.

అయితే ఇవాళ ఉదయం 8:52 గంటలకు GIFT నిఫ్టీ 24,998.50 వద్ద ప్రారంభమైంది. ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ గంటలో, సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోయి 81,700 వద్ద ట్రెడ్‌ అవ్వగా, నిఫ్టీ 170 పాయింట్లకుపైగా నష్టపోయి 24,940 కి పడిపోయింది. తర్వాత మార్కెట్లు ప్రారంభమైనప్పుడు కూడా దేశీయ సూచీలు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పడిపోయి 81,889 వద్ద నిలిచింది. నిఫ్టీ 136 పాయింట్లు తగ్గి 24,976 వద్ద ట్రేడవుతోంది.

30 షేర్ల సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, భారతి ఎయిర్‌టెల్ మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. ఇన్ఫోసిస్, HCL టెక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎటర్నల్, పవర్‌గ్రిడ్ ఆధిపత్యం చెలాయించాయి. మార్కెట్ మొదటి గంటల్లో నిఫ్టీ మైక్రోక్యాప్ 250 భారీగా నష్టపోయింది. మొత్తం ఐటీ ఇండెక్స్ 1.26 శాతం నష్టపోయింది.

ఈరోజు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు తగ్గి రూ.86.76కు చేరుకుంది. ఒక రోజు ముందు రూపాయి మారకపు విలువ 86.59 వద్ద ముగిసింది.

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇరాన్ మూడు అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడులు పశ్చిమ ఆసియాలో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. అయినప్పటికీ, మార్కెట్‌లో ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని అన్నారు. 

ప్రపంచ ట్రెండ్, విదేశీ పెట్టుబడిదారుల వ్యాపార కార్యకలాపాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ చీఫ్ వైస్ రీసెర్చ్ అజిత్ మిశ్రా ప్రకారం, ఈ వారం ప్రపంచ సూచిక మార్కెట్‌కు చాలా ముఖ్యమైందిగా పేర్కొన్నారు. దీనిలో అందరి దృష్టి ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తత, US ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలపై ఉంటుందనిఅన్నారు. 

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత ప్రభావం
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ రీసెర్చ్ సిద్ధార్థ్ ఖేమ్కా మాట్లాడుతూ, భవిష్యత్తులో ప్రపంచ సూచికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. US తయారీ, సేవా PMI డేటాతో పాటు, పెట్టుబడిదారులు భౌగోళిక రాజకీయ రంగంలో మరిన్ని పరిణామాలను గమనిస్తూ ఉంటారు అని అభిప్రాయపడ్డారు.   

టాప్ హెడ్ లైన్స్

Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget