Share Market Update: 17,800 పైన నిఫ్టీ.. 60వేల చేరువకు సెనెక్స్.. ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
క్రితంరోజు 58,927 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఉదయమే 59,415 వద్ద ఆరంభమైంది. మధ్యా్‌హ్నం 1000 పాయింట్లు పెరిగి ఇంట్రాడే గరిష్ఠమైన 59,924ను తాకింది. చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది
భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లలో మార్పులుండవన్న నిపుణుల అంచనాలు, ఎవర్‌గ్రాండ్ సంక్షోభ నివారణకు చైనా పీపుల్స్ బ్యాంకు రంగంలోకి దిగడం, ఉద్దీపన చర్యలు చేపట్టడం, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం, అమెరికా, ఐరోపా మార్కెట్లలో సానుకూల ధోరణలు కనిపించడంతో సెన్సెక్స్, నిఫ్టీ గురువారం సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. దాంతో మదుపర్ల సంపద కనీసం 3 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.
Also Read: Oyo Hotels IPO: జొమాటో బాటలో ఓయో! ఐపీఓకు రానున్న హోటల్ అగ్రిగేటర్ కంపెనీ
క్రితంరోజు 58,927 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం ఉదయమే 59,415 వద్ద ఆరంభమైంది. సెషన్ గడిచే కొద్దీ మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సూచీ మరింత పైకి చేరుకొంది. మధ్యా్‌హ్నం 1000 పాయింట్లు పెరిగి ఇంట్రాడే గరిష్ఠమైన 59,924ను తాకింది. చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. 17,546 వద్ద ముగిసిన నిఫ్టీ గురువారం 17,670 వద్ద ఆరంభమైంది. 17,838 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ 276 పాయింట్ల లాభంతో 17,822 వద్ద ముగిసింది. భారత బెంచ్‌మార్క్ సూచీలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి.
* నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్ , హిందాల్కో, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా మూడు నుంచి ఐదు శాతం వరకు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
* పరాస్ డిఫెన్స్ ఐపీఓకు విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ మూడో రోజున 223 రెట్లు డిమాండ్ కనిపించింది. షేర్లను దక్కించుకొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
* రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రేర్ ఎంటర్‌ప్రైజెస్ కేవలం పది రోజుల్లో రూ.71 కోట్లు ఆర్జించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు వంద రూపాయాలకు పైగా పెరగడమే ఇందుకు కారణం.
* యూఎస్ ఫెడ్ సమీక్ష నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగులు ఉండొచ్చు. డాలర్ విలువ పెరగడంతో బంగారం ధర కాస్త తగ్గింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి