Sabse Pehle Life Insurance: భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్న ఇండియన్స్
బీమా" జీవితానికి ధీమా. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఓ సర్వే ప్రకారం, భారతీయులు " జీవిత బీమా"కు మొదటి ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తేలింది.
" బీమా" జీవితానికి ధీమా. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అయితే ప్రపంచంలో అతి తక్కువ శాతం బీమా సౌకర్యం ఉన్న ప్రజలు భారత్‌లోనే ఉన్నారు. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. ఓసర్వే ప్రకారం, భారతీయులు " జీవిత బీమా"కు మొదటి ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తేలింది.
తమకు.. తమ కుటుంబాలకు.. సురక్షితమైన, మెరుగైన భవిష్యత్తు కోసం జీవిత బీమా చాలా అవసరం అని ప్రజలు గుర్తిస్తున్నారు. జీవిత బీమా విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారన్న అంశంపై భారతీయుల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి 12,000 మంది వ్యక్తులతో 40 నగరాల్లో నిర్వహించిన సర్వే నిర్వహించారు. ఈ సర్వే 24 జీవిత బీమా కంపెనీలన్నీ కలిపి చేపట్టాయి. ఈ సందర్భంగా "సబ్‌సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్"తో క్యాంపెయిన్ ప్రారంభించారు. జీవిత బీమానే కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుందని చెప్పడమే ఉద్దేశం.
హంసా రీసెర్చ్ భాగస్వామ్యంతో చేసిన సరవేలో 25-55 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రజలను ఎనిమిది మెట్రో నగరాలు, తొమ్మిది టైర్-1 నగరాలు, 23 టైర్-2 నగరాల నుంచి శాంపిల్స్‌గా తీసుకుని అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వే ప్రకారం భారతదేశం అంతటా అన్ని వయసుల వారికి జీవిత బీమా గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉన్నట్లుగా తేలింది. అత్యధిక మంది తమకు ఏమైనా జరిగితే కుటుంబానికి రక్షణగాఉటుందని భవిష్యత్ కోసం జీవిత బీమా ఎంతో ముఖ్యమని చెప్పారు.
సర్వేలో తేలిన ముఖ్యమైన విషయం ఏమిటంటే...71 శాతం మందికి జీవిత బీమా ఉండటమో.. లేకపోతే వెంటనే తీసుకునే ఆలోచనలోనో ఉన్నారు. కోవిడ్ పరిస్థితుల వల్ల బీమాపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగింది. ఈ సర్వేలో 91 శాతం మంది బీమా ప్రాధాన్యతను గుర్తించారు. కానీ వారిలో 70 శాతం మంది మాత్రమే పెట్టుబడి జీవిత బీమా రూపంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా జీవిత బీమా ప్రాముఖ్యతపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. నాలుగింట మూడు వంతుల మంది తమ పెట్టుబడి ప్రాధాన్యతల్లో టాప్ త్రీలో జీవిత బీమా ఉంటోంది. తమ పిల్లల చదువులు, పెళ్లిళ్ల ఖర్చులకు జీవిత బీమా ఉపయోగపడుతుందని 61 శాతం మంది తల్లిదండ్రులు నమ్మకంతో ఉన్నారు.
జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన, ఆసక్తి అంతకంతకూ పెరుగుతున్నాయని సూచించేలా సర్వేలో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి.
- జీవిత బీమా లో పెట్టుబడి అంశంపై 96 శాతం మందికి స్పష్టమైన అవగాహన ఉంది. అదే సమయంలో మ్యూచవల్ ఫండ్స్‌పై 63 శాతం మందికి, ఈక్విటీ షేర్స్‌పై 39 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది.
- సమాజంలోని అన్ని వర్గాలు మహిళలు, పురుషులు ... వారిలో అన్ని వయసుల వారికీ జీవితాబీమాపై స్పష్టమైన అవగాహన ఒకే స్థాయిలో ఉంది.
- కుర్రాళ్లతో పోలిస్తే 36 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా జీవిత బీమా తీసుకుటున్నారు.
- జీవిత బీమా తీసుకుంటున్న వారిలో సగం మంది ఏజెంట్ ద్వారా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పది శాతం మంది బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు.
- యువతరం మాత్రం ఆన్ లైన్ ద్వారా పాలసీలు తీసుకుంటున్నారు. వారు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆఫర్లు, బెనిఫిట్స్‌ను వాడుకుంటున్నారు.
- 47 శాతం మంది తమకు లేదా తమ కుటుంబంలో ఒకరికి జీవిత బీమా ఉందని.. దాని గురించి తమకు పూర్తిగా తెలుసని చెప్పారు.
నార్త్ జోన్‌లో జీవిత బీమాపై ఎక్కువ అవగాహన !
జీవిత బీమా అంటే ఏంటో తమకు స్పష్టమైన అవగాహన ఉందని నార్త్ ఇండియాలోని ప్రజలు 98 శాతం మంది సర్వేలో చెప్పారు. 94 శాతం మంది జీవిత బీమా తప్పని సరి అని అంగీకరించారు. 70 శాతం మంది తమకు.. తమ కుటుంబం భవిష్యత్ కోసం జీవిత బీమా తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో 44 శాతం మంది జీవితబీమాలో పెట్టుబడి పెట్టడం వల్ల సేఫ్‌గా ఉండటమే కాదు.. పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఎనభై శాతం మంది సోషల్ మీడియా చానల్స్ ద్వారా జీవిత బీమా గురించి ఢిల్లీ ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
వెస్ట్ జోన్‌లో మిలీనియల్స్ హవా !
వెస్ట్ జోన్‌లో పెద్దలతో పాటు మిలీనియల్స్ అంటే యువతరం జీవిత బీమాపై పూర్తి స్థాయి అవగాహనతో ఉండటమే కాదులో అందులో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముంబైలో 86 శాతం మంది ప్రజలు తమ కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నారు. 73 శాతం పుణె వాసులు జీవిత బీమా ప్రక్రియ సింపుల్‌గా ముగిసిపోతుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్, పుణె, ముంబై లాంటి ప్రాంతాల్లో 92 శాతం మంది ప్రజలు జీవిత బీమా ముఖ్యమని గట్టిగా నమ్ముతున్నారు. 80 శాతం మంది జీవిత బీమాను తమ సహచరులకు.. బంధువులకు..స్నేహితులకు రిఫర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇది 76 శాతం ఉంది. వెస్ట్‌లో నాలుగు శాతం ఎక్కువ. ఆర్థిక పరంగా ఎంతో ముందు ఉన్న ఈనగరాల్లో 45 శాతం మంది షేర్స్‌లో పెట్టుబడిపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ.
దక్షిణాదిలోనే ఇంకా ఎక్కువ ఆవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది !
నార్త్, వెస్ట్‌తో పోలిస్తే జీవిత బీమా అవసరం గురించి దక్షిణాదిలోనే తక్కువ అవగాహన ఉంది. 64శాతం మంది మాత్రమే జీవిత బీమాపై సంపూర్ణ అవగాహనతో ఉన్నారు. అదే నార్త్‌లో ఈ శాతం 78. బెంగళూరు నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 68 శాతం ప్రజలు వృద్ధాప్యంలో జీవిత బీమా ఆర్థిక భద్రత ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో 69 శాతం మంది జీవిత బీమాకొనడం సింపుల్‌గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణాది నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 58శాతం మంది తాము హఠాత్తుగా చనిపోతే కుటుంబాలకు జీవిత బీమా ఉపయోగపడుతుందని చెప్పారు. 57 శాతం మంది సడన్‌గా ఏదైనా అనారోగ్యం వస్తే జీవిత బీమా వల్ల ఇన్‌కం వస్తుందని చెప్పారు. దక్షిణాదిలో 60 శాతానికి మందికిపైగా డిజిటల్ వాలెట్స్ వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది.
" జీవిత బీమా గురించి భారతీయుల్లో అవగాహన ఏ స్థాయిలో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించాం. మా లక్ష్యం ఏమిటంటే... ఇండియాలో సంపాదన ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా కలిగి ఉండాలనేదే. ఆరోగ్యానికి.. కుటుంబ సంక్షేమానికి కూడా ఇది ఎంతో ముఖ్యం. ఇలాంటి విషయంలో ప్రజల్ని మరింత చైతన్య పరుస్తాం " అని ఎన్. భట్టాచార్య తెలిపారు.
అనుకోనిమరణం సంభవించినప్పుడు కుటుంబానికి జీవిత బీమా అండగా ఉంటుంది. అంతే కాకుండా పిల్లల చదువులకు.. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆదాయానికి, అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు బీమా ఆర్థికంగా ఆదుకుంటుంది. జీవిత బీమాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి .. మీకుటుంబం భవిష్యత్‌లో ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి.. జీవిత బీమా అండగా ఉంటుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకొనేందుకు sabsepehlelifeins.com క్లిక్ చేయండి
This is sponsered feature and provided by "Sabse pehle life insurance"