Reserve Bank of India: మోదీ సర్కారుకు పండగే! ఆర్బీఐ నుంచి రూ.87,416 కోట్ల డివిడెండ్!
Reserve Bank of India: కేంద్ర ప్రభుత్వం జాక్‌పాట్ కొట్టేసింది! భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి భారీ డివిడెండ్ పొందనుంది.
Reserve Bank of India:
కేంద్ర ప్రభుత్వం జాక్‌పాట్ కొట్టేసింది! భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి భారీ డివిడెండ్ పొందనుంది. రూ.87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే అత్యవసర నిధి బఫర్‌ను 5.5 నుంచి 6 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక ఏడాదిలో ఆర్బీఐ రూ.30,307 కోట్లను మోదీ సర్కారుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
'అంతర్జాతీయ, స్థానిక ఆర్థిక పరిస్థితులు సంబంధిత సవాళ్లపై బోర్డు సమీక్ష నిర్వహించింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావాన్ని మదింపు చేసింది' అని ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఆర్బీఐ పనితీరును గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బోర్డు చర్చించింది. 2022-23 వార్షిక నివేదిక, అకౌంట్లను ఆమోదించింది.
602nd Meeting of Central Board of the Reserve Bank of Indiahttps://t.co/7sleDEQ31o
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023
భారత బెంచ్‌మార్క్ పదేళ్ల బాండ్ యీల్డు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 7.01 శాతానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఈ ఏడాది రెట్టింపు డివిడెండ్ పొందుతుందని చాలామంది నిపుణులు అంచనా వేశారు. రెపోరేట్ల పెరుగుదలే ఇందుకు కారణం. ఫారిన్ కరెన్సీ ట్రేడింగ్‌లోనూ మెరుగైన రాబడి వచ్చింది. స్థానిక బ్యాంకులకూ అధిక వడ్డీకి రుణాలు ఇవ్వడం, లిక్విడిటీ తగ్గించడం ఇందుకు దోహదం చేశాయి.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఆర్బీఐ నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.48000 కోట్లు వస్తాయని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అంచనా వేసింది. ఈ సంస్థల నుంచి గతేడాది రూ.40,953 కోట్లు పొందాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 ఆర్థిక ఏడాదిలో అంచనా వేసిన రూ.73,948 కోట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువే. బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, ఇతర పెట్టుబడుదల ద్వారా FY2024లో రూ.43,000 కోట్లు వస్తాయని అనుకుంది. అయితే సవరించిన అంచనాల ప్రకారం రూ.43,000 కోట్లు రావడం గమనార్హం.
Also Read: అదానీ షేర్ల కిక్కు - సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ జంప్!
Also Read: అదానీ షేర్ల ధరలు - సెబీ ఫెయిలైందని చెప్పలేమన్న సుప్రీం కోర్టు కమిటీ!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.