By: ABP Desam | Updated at : 19 May 2023 03:51 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Closing 19 May 2023:
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు తెరపడింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ ఛైర్‌పర్సన్ హాకిష్ కామెంట్స్‌తో ఉదయం సూచీలు నష్టపోయాయి. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సెబీ తప్పు లేదని సుప్రీం కోర్టు నియామక కమిటీ చెప్పడంతో ఊపొచ్చింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 73 పాయింట్లు పెరిగి 18,203 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 297 పాయింట్లు పెరిగి 61,729 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలహీనపడి 82.66 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,431 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,556 వద్ద మొదలైంది. 61,251 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,784 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 297 పాయింట్ల లాభంతో 61,729 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,129 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,186 వద్ద ఓపెనైంది. 18,060 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,218 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్లు పెరిగి 18,203 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,930 వద్ద మొదలైంది. 43,531 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,020 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 217 పాయింట్లు పెరిగి 43,969 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫీ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, బ్రిటానియా, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, హీరోమోటో షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60,870గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.27,980 వద్ద ఉంది.
Also Read: అదానీ షేర్ల ధరలు - సెబీ ఫెయిలైందని చెప్పలేమన్న సుప్రీం కోర్టు కమిటీ!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations Nexus Select Trust REIT on getting listed on the Exchange today!
— NSE India (@NSEIndia) May 19, 2023
Nexus Select Trust is India’s largest retail (malls) platform of 17 high-quality assets, strategically located in dense residential catchments across 14 prominent cities and is ~96% leased.#NSE… pic.twitter.com/X9ds8zkuey
The #NSEBell has rung in the celebration of the listing ceremony of Nexus Select Trust REIT on the Exchange today! #NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #NexusSelectTrust @ashishchauhan pic.twitter.com/G8FQup8GtH
— NSE India (@NSEIndia) May 19, 2023
Listing ceremony of Nexus Select Trust REIT will be starting soon. Watch the ceremony live!https://t.co/nmq2zT84IL#NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #NexusSelectTrust @ashishchauhan https://t.co/nmq2zT84IL
— NSE India (@NSEIndia) May 19, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్