RBI Penalty on Paytm: పేటీఎంకు ఆర్బీఐ షాక్! కోటి జరిమానా.. వెస్ట్రన్ యూనియన్‌కూ పెనాల్టీ
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్‌కు ఆర్బీఐ జరిమానాలు విధించింది. సంస్థాగతపరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకే పెనాల్టీ వేశామని రిజర్వు బ్యాంకు తెలిపింది.
నిబంధనల అమల్లో విఫలమైనందుకు రెండు ఆర్థిక సంస్థలపై భారతీ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జరిమానాలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.కోటి, వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు రూ.27.78 లక్షల పెనాల్టీ వేసింది. ఇవి వినియోగదారుల లావాదేవీలకు సంబంధించనివని కావని, సంస్థాగత పరమైనవని ఆర్బీఐ వెల్లడించింది.
ఫైనల్ సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్‌కు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు దరఖాస్తు చేసుకుంటుంది. దానిని పరిశీలించిన ఆర్బీఐ.. సమర్పించిన సమాచారం యథార్థ స్థితిని ప్రతిబింబించడం లేదని తెలిపింది. 'పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ చట్టం-2007లోని సెక్షన్ 26(2) ప్రకారం ఇది తప్పిదమే. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు నోటీసులు జారీ చేశాం. రాతపూర్వక స్పందన, వ్యక్తిగత విచారణ తర్వాత ఆర్బీఐ జరిమానా విధించింది' అని ఆర్బీఐ ప్రకటించింది.
ఇక 30గా పెట్టుకున్న లబ్ధిదారుల రిమిటన్సెస్ పరిమితిని 2019, 2020లో ఉల్లంఘించినందుకు వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు రూ.27లక్షలు జరిమానా విధించారు. వ్యక్తిగత విచారణ, రాతపూర్వక సమాధానాల తర్వాత నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో పెనాల్టీ వేశామని రిజర్వు బ్యాంకు తెలిపింది. ఆర్బీఐ నిర్దేశించిన సంస్థాగత పరమైన నిబంధనల ఉల్లంఘనల వల్లే జరిమానాలు విధించామని, వినియోగదారుల లావాదేవీలతో సంబంధం లేదని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు....మీ నగరంలో బంగారం, వెండి ధరలు తెలుసుకోండి…
Also Read: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం
Also Read: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!
Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి
65 million accounts and counting !
— Paytm Payments Bank (@PaytmBank) July 9, 2021
Thank you for being a part of Paytm Payments Bank family.
The Paytm Blog has a lot of answers to your questions on payments, banking, finance and more.
— Paytm (@Paytm) October 20, 2021
For example, this right here. 👇🏼https://t.co/hjFALIskiL