(Source: ECI/ABP News/ABP Majha)
Gold Silver Price Today 21 october 2021: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు....మీ నగరంలో బంగారం, వెండి ధరలు తెలుసుకోండి…
వారం రోజులుగా స్థిరంగా కొనసాగి నిన్న తగ్గిన బంగారం ధర తెలుగు రాష్టాల్లో మళ్లీ పెరిగింది. కేజీ వెండి ధర దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది. ఉదయం 6 గంటల వరకూ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలెలా ఉన్నాయంటే
భారత్ మార్కెట్లో బంగారం ధర రూ.20 పెరగ్గా హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 150 పెరిగింది. అంటు వెండి ధర కూడా భారత్ మార్కెట్లో రూ.400 పెరిగితే హైదరాబాద్ మార్కెట్లో రూ.900 పెరిగింది. భారత్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47, 490 ఉంది. ఇక కేజీ వెండి ధర నిన్న( బుధవారం) రూ.64,200 ఉండగా...ఈ రోజు (గురువారం) రూ. 64,600 ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,490, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,450
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,490 , 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,450
విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,490, 22 క్యారెట్ల బంగారం రూ. 44,450
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,840, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600
ముంబయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,490 , 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,490
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,810, 22 , 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,740
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,490, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,450
ప్రధాన నగరాల్లో వెండిధరలు
భారత్ మార్కెట్లో వెండి ధరలు రూ.400 పెరిగ్గా...తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో కేజీ వెండి ధర నిన్న ( బుధవారం) రూ. 67,800 కాగా ఈ రోజు ( గురువారం) రూ. 68,700 ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా , బెంగళూరు, లక్నోలో కేజీ వెండి ధర రూ. 64,600 కాగా...చెన్నై ,కేరళలో కేజీ వెండి రూ. 68,700 ఉంది.
Also Read: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు : పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం
Also Read: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. నేడు మీ నగరంలో ఎంత పెరిగిందంటే..
Also Read: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి