Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తితో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్
PMGKP : కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్ వర్కర్లకు శుభవార్త అందించింది. తాజాగా ముగియనున్న ఇన్సురెన్స్ పాలసీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్19 పై పోరాటంలో విశేషంగా సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్ల కోసం కేంద్రం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పాలసీని మరో 180 రోజులపాటు వారికి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
గత ఏడాది మార్చి నెల నుంచి ఇన్సూరెన్స్ పాలసీని హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్రం తీసుకొచ్చింది. దాని గడువు అక్టోబర్ 20తో ముగియనున్న క్రమంలో మరో ఆరు నెలలపాటు పాలసీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి ఇంకా ముగియలేదని.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పాలసీని మరికొంత కాలం పొడిగించారు. అక్టోబర్ 21 నుంచి మరో 6 నెలల పాటు కొవిడ్19 పేషెంట్లకు సేవలు అందించే హెల్త్ కేర్ వర్కర్లకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వర్తించనున్నాయి. ఇప్పటివరకూ 1,351 క్లెయిమ్స్ కు నగదు అందించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Also Read: రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే నష్టపోతారు!
కాంప్రిహెన్సివ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పాలసీ కింద రూ.50 లక్షల రూపాయలను 22.12 లక్షల మందికి అందుబాటులోకి తెచ్చారు. కొవిడ్19 బాధితులకు చికిత్స, సేవలు అందించి నష్టపోయిన హెల్త్ కేర్ వర్కర్లకు మాత్రమే ఈపాలసీ వర్తిస్తుంది. కరోనా వ్యాప్తి సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రారంభించి కొన్ని నెలలపాటు కోట్లాది కుటుంబాలకు ఉచితంగా బియ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
Also Read: రూ.1.3 లక్షల్లో అత్యంత స్టైలిష్ పవర్‌ఫుల్ బైక్స్.. టాప్-5 ఇవే!
ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది, రిటైర్డ్, వాలంటీర్లు, కాంట్రాక్ట్, రోజువారీ వేతనం, తాత్కాలిక మరియు ,ట్సోర్సింగ్ సిబ్బంది రాష్ట్రాలు, కేంద్ర ఆసుపత్రులు మరియు కేంద్ర, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల స్వయంప్రతిపత్త ఆసుపత్రులు, ఎయిమ్స్, జాతీయ మరియు కోవిడ్ -19 రోగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కేంద్ర మంత్రిత్వ శాఖల ఆసుపత్రులు కూడా పీఎంజీకేపీ పరిధిలోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి