మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తోంది. అయితే కొంతమంది పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ.. చాలామందికి పెద్దగా తెలియని 5 సామాజిక భద్రతా సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం..
కేంద్రం పేదల కోసం అనేక పథకాలను తీసుకొస్తుంది. అయితే.. వాటి గురించి కొంతమందికి తెలియక సద్వినియోగం చేసుకోవడం లేదు. అలాంటి పథకాల గురించి తెలుసుకుందాం.
- ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (పీఎం-ఎస్‌వైఎం)
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (పీఎం-ఎస్‌వైఎం) అసంఘటిత రంగంలోని వారి ఆర్థిక, సామాజిక భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్‌ను అందిస్తోంది. అసంఘటిత రంగానికి చెందిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. రిక్షా తొక్కేవారు, వీధులు ఊడ్చేవారు, ఇటుకలు తయారు చేసేవారు, ఇంట్లో పనులు చేసేవారు, వ్యవసాయ రంగంలోని కూలీలు, నిర్మాణ రంగంలోని కూలీలు, బీడి వర్కర్లు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, కొబ్బరి కాయలు అమ్మేవారు ఇలా అసంఘటిత రంగంలోని ఎవరైనా పీఎం ఎస్‌వైఎం పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు.
లబ్ధిదారుని ప్రవేశ వయస్సును బట్టి నెలవారీ డిపాజిట్ రూ. 55 నుండి రూ .200 వరకు ఉంటుంది. ఈ పథకం కింద నెలవారీ 50% లబ్ధిదారుడు చెల్లిస్తే.. మరో 50% కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.
అర్హత:
తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి.
అసంఘటిత కార్మికులు (హాకర్స్, వ్యవసాయ పని, నిర్మాణ సైట్ కార్మికులు, తోలు కార్మికులు, చేనేత, మధ్యాహ్న భోజన కార్మికులు, రిక్షా లేదా ఆటో వీలర్లు, రాగ్ పిక్కర్లు, వడ్రంగులు, మత్స్యకారులు మొదలైన వారు దీని కిందకు వస్తారు)
18-40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
రూ.15,000/- కంటే తక్కువ నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి. EPFO/ESIC/NPS (ప్రభుత్వ నిధులతో) పథకంలో సభ్యత్వం కలిగి ఉండకూడదు.
ప్రయోజనం:
60 ఏళ్లు నిండిన తర్వాత, లబ్ధిదారులు కనీస భరోసా నెలవారీ పెన్షన్ రూ .3,000/-అందుకుంటారు.
లబ్ధిదారుని మరణం తరువాత, జీవిత భాగస్వామి 50% నెలవారీ పెన్షన్‌కు అర్హులు.
భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే, వారు రూ .6000/-ఉమ్మడి నెలవారీ పెన్షన్‌కు అర్హులు.
- జాతీయ పింఛను పథకం
దుకాణదారులు, వ్యాపారులు, స్వయం ఉపాధి వ్యక్తుల కోసం జాతీయ పింఛను పథకం(NPS) ఉంది. లబ్ధిదారుని ప్రవేశ వయస్సును బట్టి నెలవారీ డిపాజిట్ రూ .55 నుండి 200 వరకు ఉంటుంది. ఈ పథకం కింద మరో 50% సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
అర్హత:
తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి.
చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మొదలైన దుకాణదారులు లేదా యజమానులు అర్హులు.
18-40 సంవత్సరాల వయస్సు.
EPFO/ESIC/PM-SYM లో చేరవద్దు.
వార్షిక టర్నోవర్ రూ .1.5 కోట్లకు మించకూడదు.
ప్రయోజనం:
ఈ పథకం కింద, 60 ఏళ్లు నిండిన తర్వాత, లబ్ధిదారులు కనీస భరోసా నెలవారీ పెన్షన్ రూ .3000/-అందుకునేందుకు అర్హులు.
- ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)
అర్హత:
తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి.
18 నుండి 50 సంవత్సరాల వయస్సులోపు ఉండాలి.
ఆధార్‌తోపాటు జన్ ధన్ లేదా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి.
ప్రీమియం @ రూ .330/- సంవత్సరానికి చెల్లించాలి.
ప్రయోజనం:
ఏదైనా కారణం వల్ల మరణిస్తే 2 లక్షలు
గమనిక: ఈ పథకం ఆర్థిక సేవల శాఖ నేతృత్వంలో బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంది.
- ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)
అర్హత:
తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి.
18 నుండి 70 సంవత్సరాల వయస్సులోపు ఉండాలి.
ఆధార్‌తో జన్ ధన్ లేదా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి.
ప్రీమియం @ రూ .12/- సంవత్సరానికి చెల్లించాలి.
ప్రయోజనం:
ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం అయినట్టైతే 2 లక్షలు వస్తుంది. తాత్కలికంగా ప్రమాదం జరిగి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే రూ.లక్ష పొందొచ్చు.
గమనిక: ఈ పథకం ఆర్థిక సేవల శాఖ నేతృత్వంలో బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంది.
- అటల్ పెన్షన్ యోజన
అర్హత:
తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి
వయస్సు 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి.
ప్రయోజనం:
చందాదారుడు తన ఇష్టానుసారం 1,000-5,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. లబ్ధిదారుడి మరణం తర్వాత మొత్తాన్ని జీవిత భాగస్వామికి లేదా నామినీకి ఇవ్వబడుతుంది.
Also Read: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న శ్రీలంక సన్సేషనల్ సింగర్ యొహానీ
Also Read: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'రాథేశ్యామ్' టీజర్?
Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి