Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!
దేశంలో అత్యధిక ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్ 6వ స్థానంలో నిలవగా విశాఖపట్నం 10 స్ఖానంలో ఉంది.
ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉంది భారత్. 2031 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ ప్రయత్నిస్తోంది. దేశంలో టాప్ 10 ధనిక నగరాల జాబితా విడుదలైంది. తలసరి ఆదాయం (జీడీపీ) ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు. ఆ నగరాల జాబితాను చూద్దాం.
1- ముంబయి
ముంబయి దేశానికి వాణిజ్య రాజధాని. దేశంలోనే అత్యంత ధనిక నగరంగా ముంబయి నిలిచింది. ముంబయి జీడీపీ 310 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 4500 (ఆహారం, వసతితో కలిపి)
2- దిల్లీ
దేశ రాజధాని దిల్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ నగర జీడీపీ 293.6 బిలియన్ డాలర్లు
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 2500 (ఆహారం, వసతితో కలిపి)
3- కోల్‌కతా
కోల్‌కతా నగర జీడీపీ 150.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 1200 (ఆహారం, వసతితో కలిపి)
4- బెంగళూరు
బెంగళూరు నగర జీడీపీ 110 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 1900 (ఆహారం, వసతితో కలిపి)
5- చెన్నై
చెన్నై నగర జీడీపీ 78.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 1900 (ఆహారం, వసతితో కలిపి)
6- హైదరాబాద్
హైదరాబాద్ నగర జీడీపీ 75.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అత్యంత ధనిక నగరాల్లో హైదరాబాద్ ఆరవ స్థానంలో నిలిచింది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 2200 (ఆహారం, వసతితో కలిపి)
7- పుణె
పుణె నగర జీడీపీ 69 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 2500 (ఆహారం, వసతితో కలిపి)
8- అహ్మదాబాద్
అహ్మదాబాద్ నగర జీడీపీ 68 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 1700 (ఆహారం, వసతితో కలిపి)
9- సూరత్
సూరత్ నగర జీడీపీ 59.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ. 1600 (ఆహారం, వసతితో కలిపి)
10- విశాఖపట్నం
విశాఖపట్నం నగర జీడీపీ 43.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
రోజువారి సగటు ఖర్చు: ఒకరికి రూ.2300 (ఆహారం, వసతితో కలిపి)
Also Read: UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!