By: ABP Desam | Updated at : 25 Dec 2021 07:56 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు (File Photo)
Petrol-Diesel Price 25 December 2021: కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో దేశంలో కొన్ని రోజుల కిందట జీవితకాల గరిష్టానికి చేరిన ఇంధన ధరలు కాస్త తగ్గాయి. కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా కొంతమేర ధరలు తగ్గించినా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ధరలు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ ఒకే ధర ఉంది. నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.69 కాగా... డీజిల్ ధర రూ.94.14 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ లో పెట్రోల్ ధర 0.32 పైసలు తగ్గగా, డీజిల్‌పై 0.30 పైసల మేర తగ్గింది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.07 కాగా, డీజిల్ ధర రూ.94.49 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.16 పైసలు పెరిగి రూ.109.93 అయింది. డీజిల్ ధర రూ.0.15 పైసలు పెరగడంతో రూ.96.38 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.110.29 అయింది. డీజిల్ ధర రూ.96.36గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.17 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.22 కి చేరింది. డీజిల్ ధర 0.16 పైసల పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.34 అయింది.
చిత్తూరు జిల్లాలో ఇలా..
చిత్తూరులోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.112.34 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.1.76 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ రూ.1.58 పెరగడంతో ధర లీటర్ ధర రూ.98.18 అయింది.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Stock Market Closing: సెన్సెక్స్ 60k టచ్ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!
Top Loser Today August 16, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
టాప్ గెయినర్స్ August 16, 2022 : స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Salary Hike: గుడ్ న్యూస్! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్ పెరుగుదల!
PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్! కిసాన్ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!
TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !
Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ
Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!