By: Arun Kumar Veera | Updated at : 13 Dec 2024 05:04 PM (IST)
విమాన టిక్కెట్లను చవగ్గా బుక్ చేసుకునే చిట్కాలు ( Image Source : Other )
Booking Cheapest Flight Tickets: చాలా మంది ప్రజలు ఆకస్మిక ప్రయాణాలను ఇష్టపడరు. ఒక పద్ధతి, ప్లాన్ లేకుండా కొత్త ప్రాంతానికి వెళితే ఎలాంటి ఇబ్బందులు పడతామో అన్నది ఆ అయిష్టానికి మొదటి కారణం. ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకోవడం అలాంటి సందర్భాల్లో అతి పెద్ద పని. కొన్నిసార్లు అదే సమస్యగానూ మారుతుంది. చివరి క్షణంలో టిక్కెట్లను బుక్ చేయడం వల్ల మాములు ధర కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ముఖ్యంగా, విమాన ప్రయాణాల్లో ఇలాంటి అదనపు బాదుడు ఉంటుంది. హఠాత్తుగా ప్రయాణం పెట్టుకున్నప్పుడు, చవకగా వచ్చే విమాన టిక్కెట్ల కోసం వెతకడం పెద్ద తలనొప్పి వ్యవహారం. మీకున్న కొద్దిపాటి సమయాన్నీ అది తినేస్తుంది.
చివరి నిమిషంలో చవగ్గా బుకింగ్ డీల్ క్లోజ్ చేయడం కష్టమే గానీ, అసాధ్యం మాత్రం కాదు. దీనికోసం తెలివైన ప్రజలు అనేక ఉపాయాలు అనుసరిస్తారు.
విమాన టిక్కెట్లను చవగ్గా బుక్ చేసుకునే చిట్కాలు
ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేయండి (Search in incognito mode): కొంతమంది సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, విమాన టిక్కెట్ల కోసం వెతకడం వల్ల బ్రౌజర్‌లోని కుకీలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా, విమాన ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి, ఇది టిక్కెట్లను త్వరగా బుక్ చేసుకునేలా ప్రజలను తొందరపెడుతుంది/ మోసం చేస్తుంది. తద్వారా, చాలా మంది బెస్ట్ డీల్స్‌ను కోల్పోతారు. అలాంటి వాటిని నివారించడానికి, మీరు ఎప్పుడూ ఇన్‌కాగ్నిటో మోడ్‌లో టిక్కెట్ల కోసం సెర్చ్ చేయాలి. అలాగే, ప్రతి సెర్చ్ తర్వాత కుకీలను డిలీట్ చేయడం మరిచిపోవద్దు.
డబ్బు వాపసు ఇవ్వని టిక్కెట్‌లు (Non-refundable tickets): ఇది కొంచెం రిస్క్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, రిఫండబుల్ టిక్కెట్ల కంటే నాన్-రిఫండబుల్ టిక్కెట్‌లు చాలా చౌకగా ఉంటాయి. కాబట్టి, మీరు కచ్చితంగా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు వీటిని ఎంచుకోవచ్చు. అలాగే, మీరు ఇంకా డబ్బును ఆదా చేయడానికి రౌండ్-ట్రిప్‌ను బుక్ చేసుకోవచ్చు.
చవకైన రోజులను ట్రాక్ చేయండి (Track the cheapest days): ఎయిర్‌లైన్ రీసెర్చ్ రిపోర్టుల ప్రకారం, సోమవారం - గురువారం మధ్య ఎంపిక చేసిన రోజుల్లో విమాన టిక్కెట్‌లు తక్కువ ధరకు అమ్ముడవుతాయి. దీనిని 'ఆఫ్-పీక్ ట్రావెల్' అని కూడా అంటారు. ఈ ఆఫర్లను క్యాష్ చేసుకునేందుకు, మీరు చీప్ డేస్‌లోని ప్యాటర్న్‌ను గమనించి టిక్కెట్‌లు బుక్ చేసుకోవచ్చు.
పోల్చండి & కొనండి (Compare and buy): ఫ్లైట్ టిక్కెట్‌ను బుక్ చేసుకునే ముందు వేర్వేరు విమానాలు, తేదీల్లో వివిధ ఆఫర్‌ల కోసం వెతకాలి. ఇందుకోసం వివిధ టిక్కెట్ బుకింగ్ సైట్‌లలో శోధించాలి. మీరు తరచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటే, ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం వల్ల, ఎప్పుడు బుక్ చేస్తే టిక్కెట్ తక్కువ రేటుకు వస్తుందో సులభంగా అర్ధం అవుతుంది.
ఆఫ్-సీజన్‌లో బుకింగ్ (Book off-season): పండుగ సీజన్‌లు లేదా సెలవుల సమయంలో విమాన టిక్కెట్‌లు చాలా ఎక్కువ రేట్లు పలుకుతుంటాయి. ఆఫ్-సీజన్‌లో అవే టిక్కెట్లు చాలా తక్కువకు వస్తాయి. కాబట్టి, ఆఫ్-సీజన్ నెలల్లో మీరు చవగ్గా ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: రూ.100 కంటే తక్కువ ధరకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు - ఎయిల్‌టెల్, జియో యూజర్లకు బెనిఫిట్
Risk Free Pension Plan : రిస్క్ లేని పెట్టుబడికి LIC New Jeevan Shanti బెస్ట్.. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం సంవత్సరానికి లక్ష రూపాయల పెన్షన్
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Digital Gold:సెబీ హెచ్చరికను పట్టించుకోని ప్రజలు! 11 నెలల్లో 12 టన్నుల డిజిటల్ బంగారం కొనుగోలు!
శాంసంగ్ ఫోల్డ్‌బుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్