Recharge Plans: రూ.100 కంటే తక్కువ ధరకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు - ఎయిల్‌టెల్, జియో యూజర్లకు బెనిఫిట్
Best Recharge Plans: రూ.100కు మంచి బిర్యానీ కూడా రాని ఈ రోజుల్లో, అంతకంటే తక్కువ ధరకు మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రముఖ టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి.

Mobile Recharge Plans Under Rs 100: కొంతకాలం క్రితం, ప్రైవేట్ టెలికాం కంపెనీలు (ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా) తమ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. ఆ భారం భరించలేక, చాలా మంది మొబైల్ యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వైపు వలస వెళ్లారు. అయితే, ప్రైవేట్ టెలికాం కంపెనీలు చాలా తక్కువ రేటుకే, అంటే రూ. 100 కంటే తక్కువ ధర గల రీఛార్జ్ ప్లాన్‌లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాన్‌లలో యూజర్లు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) అందిస్తున్న రూ. 100 కంటే తక్కువ రీఛార్జ్ ప్లాన్లలో, ఏ కంపెనీ యూజర్లు ఎవరు ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారో తెలుసా?.
జియో నుంచి డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు (Jio Add-On Plans)
రిలయన్స్ జియో, తన కస్టమర్ల కోసం నాలుగు డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. వీటిని డేటా బూస్టర్‌లు అని కూడా పిలుస్తారు. ఈ ప్లాన్‌లకు ప్రత్యేకమైన వ్యాలిడిటీ ఉండదు, యాజర్ ప్రస్తుత యాక్టివ్ రీఛార్జ్‌తో లింక్ అవుతాయి. మీ రోజువారీ డేటా పరిమితి పూర్తయినప్పుడు ఈ ప్లాన్‌లు అదనపు డేటా సౌకర్యాన్ని అందిస్తాయి.
ప్లాన్ ధరలు: రూ. 19, రూ. 29, రూ. 69, రూ. 139.
డేటా పరిమితి: 1 GB నుంచి 12 GB వరకు అదనపు డేటా.
వ్యాలిడిటీ: ఇది మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటుపై ఆధారపడి ఉంటుంది.
ఈ ప్లాన్‌లతో, వినియోగదారులు, మొబైల్ డేటా పరిమితి దాటిన తర్వాత కూడా అంతరాయం లేకుండా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్ (Airtel Rs 99 Plan)
ఎయిర్‌టెల్, మీ ప్రస్తుత రీఛార్జ్‌తో కలిసి పని చేసే రూ. 99 యాడ్ ఆన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
డేటా: 20 GB వరకు అపరిమిత డేటా.
చెల్లుబాటు: 2 రోజులు.
అదనపు ప్రయోజనాలు: ఈ ప్లాన్‌తో రెండు రోజుల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar)కు ఉచిత యాక్సెస్.
ప్రత్యేకించి, స్వల్పకాలంలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. దీని ద్వారా మీరు ఆన్‌లైన్ సినిమాలు, సీరియల్స్, స్పోర్ట్, గేమింగ్‌లను ఆస్వాదించవచ్చు.
ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌లు
ఏడాదిలో తరచూ రీఛార్జ్ చేసుకునే జంఝాటం లేకుండా... రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL కంపెనీలు వార్షిక ప్లాన్‌లు అందిస్తున్నాయి.
1 సంవత్సరం వాలిడిటీతో జియో రీఛార్జ్ ప్లాన్‌లు: జియో 336 రోజులు, 365 రోజుల చెల్లుబాటుతో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.895. ఈ ప్లాన్‌తో మొత్తం 24 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 SMSలు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
జియో రూ. 3,599 ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5 GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSల ప్రయోజనం పొందుతారు. ఈ ప్లాన్‌తో జియో యాప్‌ల ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి 365 రోజుల ప్లాన్‌లు: ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కూడా 365 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లు అందిస్తున్నాయి. ధర రూ. 1999. మొత్తం 24 GB హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి.
BSNL 1 సంవత్సరం రీఛార్జ్ ప్లాన్: 365 రోజుల ప్లాన్ ధర రూ.2,999. 4G నెట్‌వర్క్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సపోర్ట్‌తో ప్రతిరోజూ 3 GB డేటా అందుబాటులో ఉంటుంది. 100 SMSలు, అపరిమిత కాలింగ్ ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

