By: Rakesh | Updated at : 19 Sep 2024 07:56 PM (IST)
మీరు హౌస్ లోన్ తీసుకుని ఆరేళ్లు అవుతుందా.. టాపప్ తీసుకుంటున్నారా ? ( Image Source : Other )
Bank Loan Topups : ఐదారు సంవత్సరాల క్రితం గృహ రుణం తీసుకున్నారా? అప్పటితో పోలిస్తే మీ ఇంటి విలువ, మీ వేతనం రెండూ పెరిగాయి. ఈ నేపథ్యంలో మరోసారి రుణాలు ఇవ్వాలని ఇటీవల బ్యాంకులు, గృహ రుణ సంస్థలు రుణగ్రహీతలను సంప్రదిస్తున్నాయి. మీరు ఇప్పటికే తీసుకున్న రుణాన్ని 'టాప్ అప్' చేయమని వారు పదే పదే కోరుతుంటారు. కాబట్టి, దీన్ని అంగీకరించే ముందు మీరు ఏమి తెలుసుకోవాలో చూద్దాం…
చాలా మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి హోమ్ లోన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం, గృహ రుణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గృహయజమానుల అవసరాలను తీర్చడానికి వివిధ రకాల హొమ్ లోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. స్టెప్-అప్ హోమ్ లోన్ , టాప్-అప్ హోమ్ లోన్ ఎంపికలు ఇందులో ముఖ్యమైనవి. మీకు ఏది సరైనదో తెలుసుకోవడానికి, మీరు రెండు రకాల రుణాల మధ్య తేడాలను అర్థం చేసుకోవాలి. టాప్-అప్ హోమ్ లోన్ అనేది ఇప్పటికే ఉన్న హోమ్ లోన్‌పై తీసుకోగల అదనపు రుణం. కొత్త లోన్ కోసం దరఖాస్తు చేయకుండా.. పర్సనల్ లేదా ప్రొఫెషనల్ ఎక్స్‌పెన్సెస్ కోసం అదనపు ఫండ్స్ అవసరమైన వారికి అనుకూలంగా ఉంటుంది. కాలక్రమేణా తమ ఆదాయం పెరుగుతుందని ఆశించే యంగ్ ప్రొఫెషనల్స్ కోసం స్టెప్-అప్ హోమ్ లోన్స్ రూపొందించారు. ఈ లోన్ తక్కువ ఈఎంఐతో ప్రారంభమవుతుంది. రుణగ్రహీత ఆదాయం పెరిగే కొద్దీ క్రమంగా పెరుగుతుంది.
టాపప్ లోన్ అంటే..
టాపప్ లోన్ లో రూ.కోటి విలువ చేసే ఇంటి కోసం గరిష్ట పరిమితి మేరకు రూ.80 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. తర్వాత ఐదేళ్లలో రూ.10లక్షలు అసలు తీర్చివేసినట్టయితే.. అప్పుడు తిరిగి రూ.10 లక్షల మేర టాపప్ హోమ్‌లోన్ తీసుకునే అర్హత ఉంటుంది. అంతేకాదు ఈ ఐదేళ్లలో పెరిగిన ఇంటి విలువను సైతం బ్యాంక్‌లు పరిగణనలోకి తీసుకుంటాయి. రూ.కోటి విలువ చేసే ఇంటి విలువ ఐదేళ్లలో రూ.1.20 లక్షలకు చేరిందనుకుంటే అప్పుడు రుణ అర్హత రూ.96లక్షలకు పెరుగుతుంది. ఈ రుణ కాల వ్యవధి కూడా, గృహ రుణం కాలానికి మించకుండా ఉంటుంది. చాలా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు టాపప్ హోమ్‌లోన్‌ను 15 ఏళ్ల కాలవ్యవధి వరకు ఆఫర్ చేస్తున్నాయి. గృహ రుణం కాల వ్యవధి ఇంకా ఏడేళ్లు, అంతకు మించి ఉంటే.. ఇతర రుణాల కంటే తక్కువ ఈఎంఐకే రుణం పొందవచ్చు. సాధారణంగా ఈ టాపప్ రుణాలపై వడ్డీ రేట్లు హౌమ్ లోన్ వడ్డీకి సమానంగానే ఉంటాయి. కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ వడ్డీకి లభిస్తున్న రుణాలుగా చెప్పుకోవచ్చు.
ఇవి గమనించాలి..
* టూర్లు, కాస్ట్లీ వస్తువుల కొనుగోళ్ల కోసం టాప్-అప్ హోమ్ లోన్ తీసుకోవడం మంచిది కాదు. వారి ఆస్తి విలువను పెంచడానికి ఉపయోగించవచ్చు.
* టాపప్ హోమ్ లోన్ వీలైనంత తక్కువ వ్యవధికి (రెండు నుండి నాలుగు సంవత్సరాలు) పరిమితం చేయాలి. దీర్ఘకాలిక ఎంపిక వడ్డీ భారాన్ని పెంచుతుంది.
* హోమ్ లోన్, టాప్-అప్‌తో సహా, అసలు ఇంటి విలువలో 75 శాతానికి మించకుండా చూసుకోవడం సౌకర్యంగా ఉంటుంది.
* చాలా కంపెనీలు ఈ రకమైన రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను వసూలు చేస్తాయి.
* బ్యాంకును సంప్రదించడం ద్వారా, వీలైతే మీరు వడ్డీ రేటులో తగ్గింపు పొందవచ్చు.
* ఇతర ఖరీదైన రుణాలను చెల్లించడానికి టాప్‌అప్ హోమ్ లోన్‌ను ఉపయోగించడం తెలివైన నిర్ణయం.
* స్టాక్ మార్కెట్లో లేదా ఇతర అధిక నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేసి, లాభాలు సంపాదించాలనే ఆలోచనతో ఈ లోన్ తీసుకోవద్దు.
* తీసుకున్న రుణాన్ని ఎలా వినియోగిస్తమనే విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటి మరమ్మతులు, ఇతర అవసరాల కోసం చాలామంది టాపప్ రుణాలను తీసుకుంటారు. పిల్లల ఉన్నత విద్యలాంటి వాటికీ వినియోగించుకోవచ్చు.
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Sandhya Theater Stampede : పోలీస్ స్టేషన్లో అర్జున్ - బయట అరెస్టులు - పోలీసులకు చిక్కిన ఆంటోనీ !
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?