అన్వేషించండి

US Dollar: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా? మీరు అనుకున్నది కాదు!

Most Powerful Currency In The World : ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అని అడిగితే చాలా మంది చెప్పే సమాధానం అమెరికన్ డాలర్. ప్రపంచ దేశాలను డాలర్ శాసిస్తుంది.

Forbes Report On World's Strongest Currency: ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అని అడిగితే చాలా మంది ఠక్కున చెప్పే సమాధానం అమెరికన్ డాలర్. ప్రపంచ దేశాలను డాలర్ శాసిస్తుంది. అంతర్జాతీయంగా వ్యాపారాలు ఎక్కువ శాతం డాలర్లలోనే జరుగుతాయి. డాలర్లకు అంత విలువ ఉంటుంది మరి. అయితే ప్రపంచలో విలువైన కరెన్సీ మాత్రం డాలర్ కాదు. అవును మీరు చదువుతున్నది నిజమే. అమెరికన్ డాలర్‌ను మించి విలువ ఉన్న కరెన్సీలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదైనా ఉందంటే అది కువైట్ దినార్ మాత్రమే. అమెరికన్ డాలర్ ఆధిపత్యం ఉన్నప్పటికి, కువైట్ దినార్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీగా ప్రకటించబడింది. బహ్రెయిన్ దినార్ రెండో స్థానంలో, ఒమాన్ రియాల్ మూడో స్థానంలో ఉంది. అందరు అనుకునే అమెరికన్ డాలర్ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం 180 కరెన్సీలను చట్టబద్ధమైనవిగా గుర్తిస్తుంది. అయితే ప్రజాదరణ, వినియోగం కరెన్సీ విలువకు సమానం కాదని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది.

ఇటీవల ప్రపంచ దేశాల కరెన్సీలపై ఫోర్బ్స్ నివేదిక ఇచ్చింది. విదేశీ కరెన్సీతో పోలిస్తే స్వదేశీ కరెన్సీతో కొనుగోలు చేయగల వస్తువులు, సేవల సంఖ్యను మూల్యాంకనం చేయడం ద్వారా కరెన్సీ విలువ నిర్ణయించబడుతుందని నివేదిక పేర్కొంది. 

ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో టాప్ 10 కరెన్సీలు  
ఫోర్బ్స్‌ ప్రకారం ప్రపంచంలో శక్తిమంతమైన కరెన్సీ
1. కువైట్‌ దినార్‌ (రూ. 270.23)
2. బహ్రెయినీ దినార్ (రూ. 220.44)
3. ఒమనీ రియాల్‌ (రూ. 215.84)
4. జోర్దడానియన్ దినార్‌ (రూ.117.1)
5. జిబ్రాల్టర్‌ పౌండ్‌ (రూ.105.54)
6. బ్రిటిష్‌ పౌండ్‌ (రూ.105.54)
7. కేమన్‌ ఐల్యాండ్‌ డాలర్‌ (రూ.99.76)
8. స్విస్‌ ఫ్రాంక్‌ (రూ.97.54)
9. యూరో (రూ.90.89)
10. డాలర్‌ (రూ.83.1)
15వ స్థానంలో ఇండియన్‌ రూపాయి ఉంది

కువైట్ తన కరెన్సీ దినార్‌ను 1960లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, చమురు నిల్వలు, పన్ను రహిత వ్యవస్థ కారణంగా కువైట్ ఆర్థిక స్థిరత్వం సాధించింది. ఫలితంగా ఆ దేశ కరెన్సీకి అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ రోజు ఒక కువైట్ దినార్‌ ఇండియన్ కరెన్సీలో రూ.270.10లకు సమానం

ప్రపంచ వ్యాప్తంగా వర్తక వ్యాపారం చేస్తున్న అమెరికన్ డాలర్ జాబితాలో పదవ స్థానంలో ఉంది. యూరోపియన్ యూనియన్‌లోని 19 సభ్య దేశాలను కలిగి ఉన్న యూరోజోన్ అధికారిక కరెన్సీ అయిన యూరో తొమ్మిదో స్థానంలో ఉంది. అమెరికన్ డాలర్ల తరువాత ప్రపంచంలో ఎక్కువగా యూరోనే ఉపయోగిస్తారు.  
 
రూపాయి వర్సెస్ డాలర్
అంతకు ముందు రోజు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 3 పైసలు క్షీణించి 83.15 వద్దకు చేరుకుంది. ఇంటర్‌ బ్యాంక్ విదేశీ మారకం వద్ద, దేశీయ కరెన్సీ 83.13 వద్ద ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 83.15కి పడిపోయింది. 

టాప్ హెడ్ లైన్స్

Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
How To Check CIBIL Score In Telugu: పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget