LIC IPO: జనవరి చివరి వారంలో సెబీకి ఎల్‌ఐసీ ఐపీవో ముసాయిదా దరఖాస్తు!!

జనవరి చివరి వారంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎల్ఐసీ ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేయనుందని తెలిసింది.

FOLLOW US: 

LIC IPO:  భారతీయ జీవిత బీమా సంస్థ (LIC INDIA) ఐపీవోలో మరో ముందడుగు పడింది! జనవరి చివరి వారంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేయనుందని తెలిసింది. ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ వార్తను రిపోర్టు చేసింది. పబ్లిక్‌ లిస్టింగ్‌కు సంబంధించిన తేదీని ఎల్‌ఐసీ అత్యున్నత అధికారులు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు చెప్పినట్టు సమాచారం. అనుకున్నట్టుగానే 2022 ఆర్థిక ఏడాదిలో ఎల్‌ఐసీ ఐపీవో ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

దేశంలోనే అత్యంత విలువైన ఐపీవోగా ఎల్‌ఐసీ నిలవనుంది. దాదాపుగా రూ.లక్ష కోట్ల విలువతో కంపెనీ మార్కెట్లో నమోదు అవ్వనుంది. కంపెనీ ఇప్పటికే పింఛన్లు, ఆన్యూటి, ఆరోగ్య బీమా, యులిప్‌ వంటి పథకాలపై దృష్టి సారించిందని అధికారులు ఇన్వెస్టర్లకు తెలియజేశారు. ఉత్పత్తుల్లో వైవిధ్యం పెంచుతున్నామని వెల్లడించారు. గతంలో ప్రవేశపెట్టిన నాన్‌ పార్టిసిపేటింగ్‌ పథకాల విక్రయాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు! రూ.40,000 కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెరుగుతున్న బడ్జెట్‌ అంతరాన్ని తగ్గించాలని పట్టుదలగా ఉన్నారు. కంపెనీ విలువను రూ.8 నుంచి 10 ట్రిలియన్ల మధ్య ఉండేలా చూసుకుంటున్నారు. 5 నుంచి 10 శాతం మధ్య వాటాను ఉపసంహరించాలని భావిస్తున్నారు.

ఎల్‌ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేర్వేరు రంగాలకు చెందిన ఇన్వెస్టర్ల మధ్య బలమైన డిమాండ్‌ సృష్టించేలా వైవిధ్యం ఉండేలా చూస్తున్నారు. యాంకర్‌ ఇన్వెస్టర్లతో చర్చలు పూర్తయితే ఐపీవోలో కీలక అడుగు పడినట్లే! ఏదేమైనా వచ్చే ఏడాది మార్చిలోపు ఇష్యూ పూర్తవ్వాలని, ఆలస్యం చేయకూడదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, గోల్డ్‌మన్‌ సాచెస్‌, జేపీ మోర్గాన్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సహా మొత్తం ఐదుగురు బ్యాంకర్లను ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Fake Pan Card Check: పాన్‌ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి

Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! రూ.210 పడిపోయిన పసిడి ధర.. వెండి మాత్రం స్వల్పంగా తగ్గుదల.. తాజా ధరలు ఇవీ..

Also Read: Tata Altroz: అల్ట్రోజ్‌లో కొత్త బడ్జెట్ వేరియంట్.. లాంచ్ త్వరలోనే!

Also Read: Budget 2022: రైతన్నకు శుభవార్త! 4% వడ్డీకి రూ.18 లక్షల కోట్లు పంట రుణాలు ఇవ్వనున్న కేంద్రం!

Also Read: Petrol-Diesel Price, 4 January: వాహనదారులకు ఊరట.. ఇక్కడ ఇంధన ధరలు భారీగా తగ్గుదల, ఈ నగరాల్లో మాత్రం ఎగబాకి.. తాజా రేట్లు ఇవీ..

Also Read: Budget 2022: ప్రభుత్వ బడ్జెట్‌ ఇన్ని రకాలా? ఇండియాలో ఏది అమలు చేస్తారో తెలుసా?

Published at : 04 Jan 2022 07:18 PM (IST) Tags: Life Insurance Corporation Lic Lic IPO Initial Public Offering LIC listing LIC-Sebi

సంబంధిత కథనాలు

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! జూన్‌ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! జూన్‌ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు

Cryptocurrency Prices: మళ్లీ నష్టాల బాటలో బిట్‌కాయిన్‌ - ఎంత తగ్గిందంటే?

Cryptocurrency Prices: మళ్లీ నష్టాల బాటలో బిట్‌కాయిన్‌ - ఎంత తగ్గిందంటే?

NSE Co-location Scam: ఎన్‌ఎస్‌ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు

NSE Co-location Scam: ఎన్‌ఎస్‌ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !