LED Bulb Vs Tube Light: ఎల్‌ఈడీ బల్బ్ Vs ట్యూబ్ లైట్: ఏది మీ కరెంట్ బిల్లును తగ్గిస్తుంది?
Cost-Effective: విద్యుత్ బల్బ్‌లు కొనే సమయంలో దాని ధర గురించి కాకుండా, దీర్ఘకాలంలో అది ఇచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించాలి. తెలివైన నిర్ణయం తీసుకుంటే, బల్బ్‌పై మీ పెట్టుబడి మీకు తిరిగి వస్తుంది.
![LED Bulb Vs Tube Light: ఎల్‌ఈడీ బల్బ్ Vs ట్యూబ్ లైట్: ఏది మీ కరెంట్ బిల్లును తగ్గిస్తుంది? LED bulb or tube light, which one will reduce your monthly electricity bill LED Bulb Vs Tube Light: ఎల్‌ఈడీ బల్బ్ Vs ట్యూబ్ లైట్: ఏది మీ కరెంట్ బిల్లును తగ్గిస్తుంది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/ccc045323dde12b13317281f80467f7f1738144223480545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Reducing Monthly Electricity Bill: సామాన్య జనం మోస్తున్న భారాల్లో నెలవారీ విద్యుత్ బిల్లు (Electricity Bill) కూడా ఒకటి. విద్యుత్ ఛార్జీలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి, కరెంట్ బిల్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చాలా ఇళ్లలో విద్యుత్ ఆదా చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నారు. అయితే, కొన్ని గాడ్జెట్‌లు ఖర్చులను తగ్గించడానికి బదులుగా అనుకోకుండా ఖర్చులు పెంచుతాయి. ఇంట్లో అమర్చే లైట్ల కోసం నిర్ణయం తీసుకునే సమయంలో ఇలాంటి సందేహం చాలా మందికి వస్తుంది. ఇప్పుడు దాదాపు అన్ని గృహాల్లో ట్యూబ్ లైట్లు, LED బల్బులు కనిపిస్తున్నాయి. అయితే, వీటిలో ఏది తక్కువ ఖర్చుతో (cost-effective) వస్తుంది & ఏది తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది (energy-efficient) అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
LED బల్బులు Vs ట్యూబ్ లైట్లు - ఎనర్జీ ఎఫీషియన్సీ:
మీ ఇంటి లైటింగ్ కోసం బల్బ్‌ను కొనేటప్పుడు, ప్రతి బల్బ్ వినియోగించే విద్యుత్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. ట్యూబ్ లైట్లతో పోలిస్తే LED బల్బులు చాలా తక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. ఇవి, శక్తిని వేడి రూపంలో వృథా చేయవు, తద్వారా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. LED బల్బులు దీర్ఘకాలం మన్నుతాయి. కాబట్టి, ఇవి ఆర్థికంగా & పర్యావరణపరంగా అనుకూలమైన ఆప్షన్‌గా మారాయి.
LED బల్బుల ప్రయోజనాలు
1. విద్యుత్ సామర్థ్యం
ట్యూబ్ లైట్లతో పోలిస్తే, LED బల్బులు చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి, దానిని తక్కువ విద్యుత్ బిల్లుగా మారుస్తాయి. LED బల్బులలో ఇమిడివున్న శక్తి మార్పిడి సామర్థ్యం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించే మోడల్‌గా వీటిని మార్చింది.
2. దీర్ఘ జీవితకాలం
LED బల్బులు సాంప్రదాయ లైటింగ్ ఆప్షన్‌కు మించి ప్రయోజనకారులు. వీటి సగటు జీవితకాలం 25,000 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. అంటే, తరచూ బల్బులు మార్చాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. తద్వారా డబ్బు & శ్రమ రెండింటినీ ఆదా చేస్తుంది.
3. పర్యావరణ అనుకూలం
సాధారణంగా, ఫ్లోరోసెంట్ లైట్లలో కనిపించే పాదరసం వంటి హానికరమైన పదార్థాలు LED బల్బులలో ఉండవు. తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరిస్తాయి. పర్యావరణ ప్రేమికులకు ఇవి మంచి ఎంపిక.
4. తక్కువ ఉష్ణ ఉద్గారాలు
ట్యూబ్ లైట్లు లేదా ఇన్‌కాండిసెంట్ బల్బుల మాదిరిగా LED బల్బులు ఎక్కువ వేడిని విడుదల చేయవు. ఇది గదిలో వేడిని పెంచదు, ఎయిర్ కండిషనింగ్ అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రూపంలోనూ విద్యుత్ ఆదా అవుతుంది.
ట్యూబ్ లైట్లలో కనిపించే లోపాలు
ట్యూబ్ లైట్లు లేదా ఫ్లోరోసెంట్ లైట్లు LED బల్బులతో పోలిస్తే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. ఇవి ఎక్కువగా వెలుగుతూ, ఆరుతూ ఉంటాయి. పూర్తి ప్రకాశాన్ని చేరుకోవడానికి ముందు వార్మప్ సమయం అవసరం. వాటి వాటేజ్ తక్కువగా ఉన్నప్పటికీ, LED టెక్నాలజీ అందించే విద్యుత్ సామర్థ్యం & ఖర్చు ఆదా వీటిలో ఉండదు.
విద్యుత్ పొదుపు కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు
బల్బ్ లేదా ట్యూబ్ లైట్ వినియోగించే విద్యుత్ పరిమాణం దాని వాటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అధిక వాటేజ్ బల్బులు అధిక విద్యుత్ వినియోగిస్తాయి. ఉదాహరణకు, 100 వాట్ల బల్బు 40 వాట్ల రేటింగ్ ఉన్న ట్యూబ్ లైట్ కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. అయితే, ఆ పరికరం సామర్థ్యం వల్ల మీ విద్యుత్ బిల్లుపై ప్రభావం తగ్గవచ్చు.
మీ ఇంటి లైటింగ్ కోసం స్మార్ట్‌గా ఆలోచించండి
విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని & పర్యావరణ అనుకూల పద్ధతులు అవలంబించాలని మీరు భావిస్తుంటే.. LED బల్బులు మీకు సరిగ్గా సూట్ అవుతాయి. ట్యూబ్ లైట్ ధర తక్కువగా అనిపించినప్పటికీ, ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే లక్షణం & తక్కువ జీవితకాలం వల్ల అవి దీర్ఘకాలంలో ఆర్థిక భారంగా మారతాయి. ఎల్‌ఈడీ బల్బ్ ధర ఎక్కువగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో అవి డబ్బును ఆదా చేస్తాయి. కాబట్టి, LED బల్బుల వినియోగం ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం.
మరో ఆసక్తికర కథనం: వారంలో 4 రోజులు పని, 3 రోజులు విశ్రాంతి - 200 కంపెనీల సంచలన నిర్ణయం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)