Koo App: 'కూ' ఇక మరింత భద్రంగా.. పటిష్టంగా.. యూజర్ ఫ్రెండ్లీగా!
మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'కూ' తన వినియోగదారుల భద్రతే లక్ష్యంగా పటిష్టమైన చర్యలు చేపడుతోంది.
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా వినియోగదారులకు మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'కూ' అవగాహన కల్పిస్తోంది. 'కూ'యాప్ వినియోగించే వారిలో ఎక్కువ మంది మొదటిసారి సోషల్ మీడియా వినియోగించేవారే. దీంతో వారి భద్రత అనేది చాలా కీలకం.
దుర్వినియోగం కాకుండా..
మన చుట్టూ ఉన్నావారికి కనెక్ట్ కావడానికి, స్నేహం చేయడానికి సోషల్ మీడియా అనేది ఒక ముఖ్యమైన వేదిక అయినప్పటికీ దాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్థిక నేరాలు, గోప్యతకు భంగం కలిగించడం, డేటా చోరీ సహా పలు సైబర్ నేరాలకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. కనుక ఇలాంటి వాటి నుంచి తమ వినియోగదారులను కాపాడేందుకు 'కూ' పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అలాంటి వాటికి మన బలికాకుండా ఉండేందుకు యూజర్స్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది.
భద్రతే లక్ష్యంగా..
ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ), భారత ప్రభుత్వంతో ఇటీవల 'కూ'యాప్ కొలాబరేట్ అయింది. సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు వీటితో కలిసి 'కూ' పనిచేస్తోంది. ఈ నెలను జాతీయ సైబర్ భద్రత అవగాహన కోసం కేటాయించారు. ముఖ్యంగా CERT-In, 'కూ' యాప్ కలిసి వినియోగదారులకు ఫిషింగ్, హ్యాకింగ్, వ్యక్తిగత సమాచార భద్రత, పాస్‌వర్డ్ & ఏఎమ్‌పీ, పిన్ మేనేజ్‌మెంట్, one's భద్రత, పబ్లిక్ వైఫైను వినియోగించేటప్పుడు గోప్యత వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నాయి.
ఫేక్‌ను గుర్తించేలా..
దేశవ్యాప్తంగా పలు భారత భాషల్లో ఈ క్యాంపెయిన్‌ను 'కూ' నిర్వహించింది. ముఖ్యంగా ఏమైనా కంటెంట్ ఫేక్ అని తెలిస్తే ఫ్లేగ్ చేయాలని 'కూ' సూచిస్తోంది. ఇలా చేసినవారికి రివార్డులు కూడా ప్రకటించనున్నట్లు పేర్కొంది. అయితే ఫేక్ కాని వాటిన్ ఫ్లేగ్ చేస్తే పెనాల్టీ కూడా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇందుకోసం ఓ సలహా బోర్డ్‌ను కూడా ఏర్పాటు చేయనుంది 'కూ'. బాధ్యతాయుతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మంచి ప్రాక్టీసెస్‌ను తీసుకువచ్చేలా 'కూ' చర్యలు చేపడుతోంది. అన్ని భాషల యూజర్లకు సెక్యూర్ వేదికను ఇవ్వడమే లక్ష్యంగా 'కూ' పనిచేస్తోంది.
1.5 కోట్లు..
ఈ మేడ్ ఇన్ ఇండియా సోషల్ మీడియా వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. 2020 మార్చిలో ప్రారంభమైన 'కూ' యాప్ ఇప్పటికే 1.5 కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతోంది. ఇప్పటికే 9 దేశీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా, అస్సామీ, గుజరాతీ సహా ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. రాజకీయ, క్రీడా, సినీ, మీడియా ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు 'కూ' యాప్‌ను వినియోగిస్తున్నారు.
వచ్చే ఏడాదికి 'కూ'ను వినియోగించే వారి సంఖ్య 10 కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: ABP Desam On Koo: తాజా వార్తల కోసం కూ యాప్‌లో ఏబీపీ దేశంను ఫాలో అవ్వండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి