అన్వేషించండి

Ice Cream Price Hike యుద్ధానికి కరిగిపోతున్న ఐస్‌క్రీమ్, చాక్లెట్‌! భారీగా పెరుగుతున్న ధరలు!

Ice Cream Price Hike : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలనే కాకుండా ఐస్‌క్రీమ్, చాక్లెట్ల ధరలపై కూడా పడుతోంది. ఈ దెబ్బకు ధరు 10 నుంచి 22 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఐస్ క్రీమ్, చాక్లెట్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.
  • నట్స్, కోకో దిగుమతులు తగ్గడంతో ముడిసరుకుల కొరత ఏర్పడింది.
  • రవాణా ఖర్చులు పెరగడం, ప్యాకేజింగ్ వస్తువుల ధరలు పెరిగాయి.
  • వేసవిలో పెరుగుతున్న డిమాండ్‌తో కంపెనీలు ధరలు పెంచుతున్నాయి.

Ice Cream Price Hike భారత్‌లో వేసవి కాలం అంటేనే సెలవులు, చల్లని ఐస్‌క్రీమ్‌లు, నోరూరించే చాక్లెట్లు, విహారయాత్రలు. కానీ ఈ వేసవి మాత్రం వినియోగదారులకు చేదు అనుభవాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. పెరుగుతున్న ఎండలతోపాటు మనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్, చాక్లెట్ల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది కేవలం వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు దీని వెనుక అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ వాతావరణం ఉంది. 

ప్రస్తుతం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, ముఖ్యంగా సముద్ర మార్గాల ద్వారా జరిగే రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. 

Also Read: మీ క్రెడిట్, డెబిట్ కార్డు మారినా పేమెంట్స్ ఆగవు.. కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్

ముడి సరకుల కొరతతో తప్పని ధరల పెంపు

దీంతో ఐస్‌క్రీమ్, చాక్లెట్ల తయారీలో ఉపయోగించే నట్స్, డ్రై ఫ్రూట్స్, కోకో ధరలు గత కొన్ని వారాల్లో అనూహ్యంగా పెరిగాయి. భారత్‌లో తన అవసరాలకు సరిపడా బాదం, పిస్తా వంటి నట్స్‌ను, నాణ్యమైన కోకోను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా ఈ దిగుమతులు నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల మార్కెట్‌లో కొరత ఏర్పడింది. సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారడంతో అనేక కంపెనీలు తమ సరకును విమానాల ద్వారా రవాణా చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు టర్కీ నుంచి దిగుమతి అయ్యే హాజెల్‌నట్స్ రవాణా ఖర్చులు 75 శాతం పెరిగాయి. 

20 శాతం వరకు ధరల పెంపునకు అవకాశం

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, యుద్ధానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుత ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. నట్స్‌, డ్రై ఫ్రూట్స్ ధరలు 15 శాతం నుంచి 22 శాతం వరకు పెరిగాయి. చాక్లెట్ల తయారీకి ప్రాణవాయువు వంటి కోకో సరఫాలో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది.కేవలం తినుబండారాలే కాకుండా, వాటిని ప్యాక్‌ చేసే థర్మోకోల్‌ బాక్సులు, ఇతర ప్యాకేజింగ్ వస్తువుల ధరలు కూడా పెరిగాయి. 

Also Read: హోం లోన్ గడువు ఎంచుకునేటప్పుడు ఈ పొరపాటు చేయవద్దు..

వేసవి డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలోనే ఈ సంక్షోభం తలెత్తడం కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది. ఉత్పత్తుల నాణ్యతను తగ్గించలేక, భారమంతా వినియోగదారులైనే వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను సగటున పదిశాతం పెంచినట్టు నేరుచల్స్ సంస్థ డైరెక్టర్‌ సిద్ధాంత కామత్ తెలిపారు. డ్రై ఫ్రూట్స్‌, కోకో సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. గ్లోబల్ కమోడిటీ ధరలు, లాజిస్టిక్‌ ఖర్చు పెరగడం వల్ల ఐస్‌ క్రీమ్ ధరలను ఎంపిక చేసిన విభాగాల్లో పెంచినట్టు మదర్‌ డైరీ ఎండీ డైరెక్టర్ వెల్లడించారు. హాజెల్‌నట్స్ ధరలు 75 శాతం పెరగడంతో వచ్చే నెలలో తమ చాక్లెట్ల ధరలను పెంచక తప్పదని పాస్‌కాటీ చాక్లెట్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు దేవాన్ష్‌ స్పష్టం చేశారు. 

కేవలం చాక్లెట్లు మాత్రమే కాదు... 

ఈ సంక్షోభం కేవలం డెజర్ట్‌లను మాత్రమే కాకుండా డైట్ కోక్‌పై ప్రభావం పడుతుంది. గతంలో ముంబై, బెంగళూరు, గుర్‌గ్రామ్‌ నగరాల్లో చాలా రోజులు ఈ కొరత ఏర్పడింది. అంతే కాకుండాబీర్ , లిక్కర్ సీసాల కొరత కారణంగా వాటిపై ప్రభావం పడనుంది. 

Also Read: రైలు టికెట్‌తో పాటు ప్రయాణికులకు లభించే ఉచిత సేవలు, సౌకర్యాలు ఇవే

Frequently Asked Questions

ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు ప్రభావితమయ్యాయి. దీనివల్ల ఐస్ క్రీమ్, చాక్లెట్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులు తగ్గి, ధరలు పెరిగాయి.

ముడి సరకుల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?

నట్స్, డ్రై ఫ్రూట్స్, కోకో వంటి ముడి సరకుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. యుద్ధం కారణంగా వీటి దిగుమతులు నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం మార్కెట్లో కొరతకు దారితీసింది.

రవాణా ఖర్చులు ఎంత వరకు పెరిగాయి?

సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారడంతో, కొన్ని కంపెనీలు విమానాల ద్వారా సరకును రవాణా చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు, టర్కీ నుండి దిగుమతి అయ్యే హాజెల్‌నట్స్ రవాణా ఖర్చులు 75 శాతం పెరిగాయి.

ధరల పెరుగుదల ఎంత శాతం వరకు ఉండవచ్చు?

పరిశ్రమ వర్గాల ప్రకారం, నట్స్, డ్రై ఫ్రూట్స్ ధరలు 15% నుండి 22% వరకు పెరిగాయి. కోకో సరఫరాలో అంతరాయం మరియు ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం వల్ల మొత్తం ధరలు 20% వరకు పెరిగే అవకాశం ఉంది.

ఈ సంక్షోభం కేవలం ఐస్ క్రీమ్, చాక్లెట్లకే పరిమితమా?

కాదు, ఈ సంక్షోభం డైట్ కోక్, బీర్, మరియు లిక్కర్ సీసాల సరఫరాపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని నగరాల్లో వీటి కొరత ఏర్పడింది.

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget