అన్వేషించండి

Indian Raiways Free Services: రైలు టికెట్‌తో పాటు ప్రయాణికులకు లభించే ఉచిత సేవలు, సౌకర్యాలు ఇవే

Indian Railways Free Facilities: రైలులో ప్రయాణించే వారికి తమ టికెట్‌తో పాటే లభించే, జర్నీలో దొరికే కొన్ని సౌకర్యాల గురించి తెలియదు. ఈ విషయాలు తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Indian Railways Free Facilities: భారత్‌లో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రజలు తక్కువ ఖర్చులో, సౌకర్యవంతంగా ప్రయాణిస్తూ వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. చాలామంది నిత్యం ఆఫీసులకు లేదా బిజినెస్, ఇతర పనులకు వెళ్లడానికి కూడా రైలులో ప్రయాణిస్తారు. అయితే రైల్వే అందించే కొన్ని ప్రత్యేక సౌకర్యాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రైలు టికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణికులకు పలు సర్వీసులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. ఈ సౌకర్యాల వల్ల ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. కొన్నిసార్లు టైమ్ ఆదా అవుతోంది. కనుక మీరు కూడా ఆ సౌకర్యాలపై ఓ లుక్కేయండి. 

రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్ సౌకర్యం
మీ రైలు ఆలస్యమైనా లేదా మీరు ముందుగానే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నా, స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు హాయిగా కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ లగేజీని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే అనేక పెద్ద స్టేషన్లలో ఏసీ (AC), నాన్ ఏసీ (Non AC) వెయిటింగ్ రూములు రెండూ అందుబాటులో ఉంటాయి.

ఉచిత వైఫై (Wi-Fi) సౌకర్యం
నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ మనకు రోజువారీ సౌకర్యంగా మారిపోయింది. ఇది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అనేక పెద్ద స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తుంది. తద్వారా మీరు మీ మొబైల్ డేటాను వాడకుండానే  రైలు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా కూడా వైఫై నెట్‌ సాయంతో మీ ఆన్‌లైన్ పనులను కూడా పూర్తి చేసుకోవచ్చు.

ఏసీ కోచ్‌లలో లభించే ప్రయోజనాలు
మీరు ఏసీ కోచ్‌లో జర్నీ టికెట్ తీసుకున్నట్లయితే, రైల్వే మీకు బెడ్‌షీట్, తలగడ, దుప్పట్లను ఉచితంగా అందిస్తుంది. దీని కోసం మీరు అదనంగా ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు. దీనివల్ల మీ రాత్రి ప్రయాణం చేసినా ఏ ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా మారుతుంది. వేసవిలో వీటి అవసరం తక్కువగా ఉంటుంది కానీ, చలికాలం, వర్షకాలంలో ఈ బెడ్‌షీట్, దుప్పట్లు మీ జర్నీని సౌకర్యవంతగా అయ్యేలా చేస్తాయి.

 మెడికల్ ఎమర్జెన్సీలో సహాయం
రైలు ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా మీ ఆరోగ్యం లేదా ఇతర ప్రయాణికుడికి అనారోగ్య సమస్యలు వస్తే, రైల్వే తరపున వైద్య సహాయం అందించనున్నారు. ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంటే తరువాత స్టేషన్‌లో డాక్టర్‌ను సైతం ఏర్పాట్లు కూడా చేస్తారు. అలాగే ఈ సమయంలో రైల్వే సిబ్బంది మీకు పూర్తి సహాయాన్ని అందిస్తారు.

భద్రత, సహాయం
రైలు ప్రయాణంలో మీకు ఎలాంటి సమస్య ఎదురైనా TTE, కోచ్ అటెండెంట్, రైల్వే హెల్ప్‌లైన్ మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో ఈ సౌకర్యాలు మీకు ఎంతో అవసరం, ప్రయోజనకరంగా ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget