అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

PM Surya Ghar: రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి?

విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందుతారు. ప్రతి నెలా వేల రూపాయలు ఆదా అవుతాయి.

PM Surya Ghar Muft Bijli Yojana Apply Online: ఇటీవల ప్రకటించిన 'ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన'కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సబ్సిడీ తీసుకోవడంతో పాటు మీ ఇంటికి జీవితకాలం ఉచితంగా విద్యుత్‌ పొందొచ్చు.

కొత్త రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌ను (పీఎం సూర్య ఘర్ ముప్త్‌ బిజిలీ యోజన) తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ పథకం గురించి ప్రస్తావించారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సామాన్యులకు, ప్రభుత్వానికి ప్రయోజనం
ఈ పథకం వల్ల సామాన్యులు, ప్రభుత్వం రెండూ లబ్ధి పొందుతాయి. సాధారణ ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సౌరశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా, విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందుతారు. ప్రతి నెలా వేల రూపాయలు ఆదా అవుతాయి. సౌరశక్తి నుంచి మరింత ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా, విద్యుత్‌ అవసరాల్లో భారత్‌ స్వావలంబన సాధించగలుగుతుంది.

రూ.78 వేల వరకు సబ్సిడీ
అధికారిక ప్రకటన ప్రకారం, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీ లభిస్తుంది.

తాకట్టు లేకుండా చౌక వడ్డీ రుణం
సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్‌ కోసం సామాన్య ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం, ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలను బిగించుకోవడానికి 7 శాతం వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.

సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ‍‌(How to apply for PM Surya Ghar Muft Bijli Yojana to get a subsidy?):

- ముందుగా https://pmsuryaghar.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ కోసం, విద్యుత్ పంపిణీ సంస్థ పేరు, కస్టమర్ నంబర్, మొబైల్, ఇ-మెయిల్ అవసరం.
- వినియోగదారు/కస్టమర్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ఫామ్‌ను ఎంచుకోండి.
- సమీక్ష తర్వాత, అర్హుడైన దరఖాస్తుదారుకు ఆమోదం లభిస్తుంది.
- ఆమోదం పొందిన తర్వాత, సంబంధిత డిస్కంలో నమోదు చేసుకున్న ఏదైనా విక్రేత నుంచి ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
- ప్యానెల్ ఇన్‌స్టలేషన్ తర్వాత, ఫ్లాంట్‌ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
- నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత & డిస్కమ్‌ తనిఖీ తర్వాత, పోర్టల్‌లో కమీషనింగ్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటుంది.
- సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్‌ చేసిన చెక్‌తో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోండి.
- 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం క్రెడిట్‌ అవుతుంది.

మరో ఆసక్తికర కథనం: మూడు రోజులకొక హాలిడే, స్టాక్‌ మార్కెట్లకు ఈ నెలలో 12 సెలవులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget