అన్వేషించండి

Holiday: మూడు రోజులకొక హాలిడే, స్టాక్‌ మార్కెట్లకు ఈ నెలలో 12 సెలవులు

ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, సగటున ప్రతి మూడు రోజుల్లో ఒక రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడే.

Stock Market Holidays in March 2024: భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈ నెలలోని (మార్చి 2024) మొత్తం 31 రోజుల్లో కేవలం 19 రోజులే పని చేస్తాయి, 12 రోజులు నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌. అంటే, మార్కెట్లు మూడింట ఒక వంతు రోజులు సెలవుల్లో ఉంటాయి. 

ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, సగటున ప్రతి మూడు రోజుల్లో ఒక రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడే. దీంతో, అతి తక్కువ ట్రేడింగ్‌ రోజులు ఉన్న నెలల్లో ఒకటిగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి నెల నిలుస్తుంది. 

ఈ నెలలో మహా శివరాత్రి, హోలీ, గుడ్‌ ఫ్రైడే
ఈ నెలలో రెండు పెద్ద పండుగలు, ఒక సంతాప దినం ఉన్నాయి. ఆ సందర్భాల వల్ల నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (NSE), బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) పని చేయవు. మన దేశంలోని ప్రధాన పండుగల్లో ఒకటైన మహా శివరాత్రి మార్చి 08న వచ్చింది. మార్చి 25న హోలీ (ధులెండి) ఉంది. సంతాప దినమైన గుడ్ ఫ్రైడే ఈ నెలాఖరులో వచ్చింది. 

మార్చి 08 నుంచి లాంగ్‌ వీకెండ్‌
పరమ శివుడిని ఆది దేవుడిగా హిందువులు పూజిస్తారు. మహా శివరాత్రి అంటే, భోళా శంకరుడిని అర్చించేందుకు సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే వచ్చే అతి గొప్ప ముహూర్తం. ఇది, మార్చి 08న శుక్రవారం రోజున వచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా ఆ రోజున స్టాక్ మార్కెట్లు పని చేయవు. ఆ తర్వాత.. 9వ తేదీన శనివారం, 10వ తేదీన ఆదివారం ఉన్నాయి. అందువల్ల, స్టాక్ మార్కెట్లు వరుసగా 3 రోజులు సెలవు తీసుకుంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా మార్చి 8న జరుపుకుంటారు.

మార్చి 23 నుంచి మరో సుదీర్ఘ వారాంతం
రంగుల పండుగ హోలీ ఈ సంవత్సరం మార్చి 25న వచ్చింది, ఆ రోజు సోమవారం. దీనికి ముందున్న శని, ఆదివారాలు (మార్చి 23, 24 తేదీలు) కూడా సెలవులు. కాబట్టి, మార్చి నెలలో మరోమారు వరుసగా 3 రోజులు నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌ ఉంటాయి. ఈ వారాంతం కూడా లాంగ్ వీకెండ్‌గా మారుతుంది.

మార్చి 29 నుంచి నెలాఖరు వరకు నాన్‌-ట్రేడింగ్‌ డేస్‌
యేసు ప్రభువును శిలువ వేసిన జ్ఞాపకార్థం, సంతాప దినంగా పరిగణించే గుడ్‌ ఫ్రైడే మార్చి 29న ఉంది. ఈ రోజున ఏసుక్రీస్తును శిలువ వేశారని నమ్ముతారు. ఆ రోజు గ్లోబల్ మార్కెట్లు కూడా మూతబడతాయి. అమెరికన్ మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లకు కూడా సెలవు ఉంటుంది. దీని తర్వాత వచ్చే శని, ఆదివారాలను కూడా కలుపుకుంటే, వరుసగా.. మార్చి 29, 30, 31 తేదీల్లో మార్కెట్‌కు సెలవులు ఉంటాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget