అన్వేషించండి

Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

మార్చి 8వ తేదీ, శుక్రవారం నాడు మహా శివరాత్రి పర్వదినం ఉంది. ఆ తర్వాత వచ్చే రెండో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు బ్యాంక్‌లు పని చేయవు.

Bank Holidays List For March 2024: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) చివరి నెల, మార్చిలోకి అడుగు పెట్టాం. ప్రతి నెలలో బ్యాంక్‌లకు కొన్ని సెలవులు ఉంటాయి. ఏ రోజుల్లో బ్యాంక్‌లు పని చేస్తాయి, ఏ రోజుల్లో పని చేయవో ముందే తెలుసుకోకపోతే, బ్యాంక్‌ కస్టమర్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

ఈ నెలలో (మార్చి 2024) బ్యాంక్‌లు దాదాపు సగం రోజులు పని చేయవు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 14 రోజులు మూతబడి కనిపిస్తాయి. ఈ 14 రోజుల్లో జాతీయ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండు & నాలుగు శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్‌ సెలవులను నిర్ణయిస్తాయి.

ఈ సెలవులను చూస్తే... మార్చి 8వ తేదీ, శుక్రవారం నాడు మహా శివరాత్రి పర్వదినం ఉంది. ఆ తర్వాత వచ్చే రెండో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు బ్యాంక్‌లు పని చేయవు. మార్చి 25న హోలీ ఉంది. దీనికి ముందు నాలుగో శనివారం, ఆదివారంతో కలిపి మళ్లీ 3 వరుస సలవులు వచ్చాయి.

ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఏ పని ఉన్నా, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగా సేవ్‌ చేసుకోండి. సెలవు రోజులను గుర్తు పెట్టుకుంటే, ఆ రోజుల్లో బ్యాంక్‌కు వెళ్లకుండా ఆగొచ్చు, సమయం వృథా కాకుండా ఉంటుంది.

2024 మార్చిలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in March 2024): 

మార్చి 01 (శుక్రవారం) ------ చాప్చార్ కుట్ ------ మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 03 ------ ఆదివారం ------  దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 08 (శుక్రవారం) ------ మహా శివరాత్రి ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే

మార్చి 09 ------ రెండో శనివారం ------  దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి

మార్చి 10 ------ ఆదివారం ------  దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

మార్చి 17 ------ ఆదివారం ------  దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

మార్చి 22 (శుక్రవారం) ------  బిహార్ దివస్ ------  బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 23 ------ నాలుగో శనివారం ------  దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి

మార్చి 24 ------ ఆదివారం ------  దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

మార్చి 25 (సోమవారం) ------  హోలీ ------  కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా అన్ని ప్రాంతాల్లో సెలవు

మార్చి 26 (మంగళవారం) ------  యయోసాంగ్ రెండో రోజు/హోలీ ------  ఒడిశా, మణిపూర్, బీహార్‌లో బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 27 ‍‌(బుధవారం) ------  హోలీ ------  బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 29 ‍‌(శుక్రవారం) ------  గుడ్ ఫ్రైడే ------  త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము & కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లో సెలవు

మార్చి 31 ------ ఆదివారం ------  దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

సెలవు రోజుల్లోనూ మీ పని ఆగదు
ప్రస్తుతం, బ్యాంకింగ్‌ టెక్నాలజీ చాలా పెరిగింది. మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బ్యాంక్‌ హాలిడేస్‌ మీ పనులపై పెద్దగా ప్రభావం చూపవు. ఈ డిజిటల్‌ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్‌ ముందుగానే మీకు తెలియజేస్తుంది. 

భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్‌ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి. 

మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో మళ్లీ వృషభ సవారీ - 73,000 దాటిన సెన్సెక్స్‌, 22,150 పైన నిఫ్టీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget