Bapatal District Crime News : తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం
Bapatal District Crime News : తాగి వచ్చి భార్యలను హింసించే భర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందో భార్య. తనకు పెట్టే హింసను భరించ లేక అందరూ చూస్తుండగానే పెనిమిటిని హతమార్చింది.
Bapatal District Crime News : బాపటల్ జిల్లా నిజాంపట్నం మండలంలో దారుణం జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజునే భర్త ప్రాణాలు తీసిందో భార్య. తాగి వచ్చి పెట్టి హంసను ఇన్నేళ్లు భరించిన భార్య ఇప్పుడు తిరగబడి ప్రాణాలు తీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పతి ప్రాణాలు తీసేసింది.
బాపటల్ జిల్లా నిజాంపట్నం మండలంలో కొత్త పాలెంలో ఈ ఘటన జరిగింది. అమరేంద్ర, అరుణ భార్య భర్తలు. అమరేంద్ర తాగుడుకు బానిసై నిత్యం భార్యను హింసించే వాడు. డబ్బులు కోసం, భోజనం దగ్గర ప్రతి విషయంలో హింసించేవాడు. ఆ ఇంట్లో కొట్టాట రోజూ మామూలు వ్యవహారంలా మారిపోయింది.
ఇన్నేళ్లుగా భర్త పెట్టే హింసను భరిస్తూ వచ్చిన భార్య అరుణలో సహనం నశించిపోయింది. తన నగలు ఇంట్లో వస్తువులు అమ్మేసిన పట్టించుకోని ఆమె హింస మితిమీరిపోవడంతో ఉగ్రరూపం దాల్చింది. జనవరి 1న తాగి వచ్చిన భర్త కొట్టే ప్రయత్నం చేయగా తిరగబడంది.
గ్రామంలోని ప్రజలందరూ చూస్తుండగానే భార్యభర్తలు గొడవ పడ్డారు. డబ్బులు ఖర్చు అవ్వడమే కాకుండా పరువు కూడా పోతుందని ఆవేశంతో భర్త అమరేంద్రపై తిరగబడింది అరుణ. భర్త తలపై కర్రతో కొట్టింది. తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయిన భర్త మెడకు తాడు బిగించింది.
ప్రజలంతా చూస్తుండగానే ఉరి తాడు బిగించి తన కసిని తీర్చుకుంది. వదిలేయాలని భర్త ప్రాధేయపడుతున్నా కనికరించకుండా తాడు బిగించింది. ఇన్ని రోజులు పెట్టిన హింస గురించి ఒక్కొక్కటిగా చెబుతూ ప్రాణాలు తీసేసింది. ఇన్ని రోజులు తాను అనుభవించిన హింసను ఓ అరగంటపాటు భర్తకు చూపించింది.
ఈ తతంగాన్ని స్థానికులు చూస్తున్నారనే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. ఏమని అడిగితే అలాంటి భర్త బతకడ కంటే చావు బెటర్ అంటూ సమాధానం చెబుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి హింసించేవాడని వివరిస్తున్నారు. చాలా కాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోందని అన్నారు. పోలీసు స్టేషన్‌లో కూడా ఇద్దరి మధ్య పంచాయితీ నడిచిందని తెలిపారు.
ఎప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా అందరి ముందు తాను మారిపోయానంటూ ఒప్పుకొని మళ్లీ తర్వాత రోజు నుంచి భార్యపై చేయి చేసుకున్నాడని వివరించారు. చాలా సార్లు గ్రామ పెద్దలు చెప్పినా వినిపించుకోవడం లేదని అన్నారు. హింసతో విసిగిపోయిన భార్య ఈ పని చేసిందని అందుకే ఏ ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని అంటున్నారు.
గ్రామస్తుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కొత్త పాలెం చేరుకున్నారు. అమరేంద్ర మృతి చెందాడని నిర్దారించుకున్నారు. భార్య దాడిలో చనిపోయినట్టు కేసు నమోదు చేసుకున్నారు. అతని భార్య అరుణను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. వారి చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నారు.
గతంలో హైదరాబాద్‌లో అమరేంద్ర హోంగార్డుగా పని చేసేవాడు. ఉద్యోగం పోవడంతో నిజాంపట్నం వెళ్లిపోయాడు. అక్కడ తాగుడుకు బానిస అయ్యాడు. భర్త తాగుడు, హింసను తట్టుకోలేక భార్య పుట్టిల్లు కొత్తపాలెం వెళ్లిపోయింది. భర్త మాత్రం సొంతూరు గోకర్ణమఠంలో ఉంటున్నాడు. డిసెంబర్ 31న భార్య కోసం కొత్తపాలెం వెళ్లాడు. అక్కడ తాగుతూ భార్యపై మరోసారి దాడి చేశాడు. అప్పటి వరకు భరిస్తూ వచ్చిన అరుణ్ దాడి చేసి హత్య చేసింది.
Also Read: అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం - జేసీ దివాకర్‌రెడ్డికి భారీ నష్టం