Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సెంటిమెంట్ పక్కన పెట్టారు. ఇన్ని రోజులూ తన సినిమా ప్రారంభోత్సవాలకు హాజరుకాని ఆయన ఈ రోజు రాజమౌళి సినిమా ఓపెనింగ్ లో సందడి చేశారు. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమా ఓపెనింగ్ అంటే హడావుడి గట్రా ఏమీ ఉండవు. సింపుల్ అండ్ స్ట్రయిట్ టు ద పాయింట్ అన్నట్టు ప్రొడక్షన్ హౌస్ ఆఫీసుల్లో జరుగుతాయి. మహేష్ బాబు తన సినిమా ప్రారంభోత్సవాలకు హాజరు కారు. అందువల్ల ఎటువంటి సందడి ఉండదు. కానీ ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోండి.
సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు!?
మహేష్ బాబుకు ఒక సెంటిమెంట్ ఉంది. తన సినిమా ఓపెనింగ్ లేదా లాంచ్ ఈవెంట్ వంటి కార్యక్రమాలకు తాను హాజరు అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని మహేష్ బాబు నమ్ముతారని, అందుకే సినిమా ప్రారంభోత్సవాల్లో ఆయన కనిపించరని ఇండస్ట్రీ టాక్. అయితే ఇప్పుడు ఆ సెంటిమెంట్ తీసి పక్కన పెట్టేశారు సూపర్ స్టార్.
దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ బాబు ఒక సినిమా (SSMB29 Launch) చేస్తున్న విషయం పాన్ వరల్డ్ ప్రేక్షకులు అందరికీ తెలుసు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ రోజు (జనవరి 1న) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ఆ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరు అయ్యారని తెలిసింది. అయితే... పూజలో మహేష్ బాబు పాల్గొనలేదని, ఉదయం 10 గంటలకు పూజ అయిపోయిన తరువాత అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్లారని హీరో సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆయన వెళ్ళడానికి ముందు పూజను సింపుల్ గా చేసేశారట. మహేష్ బాబు తన సెంటిమెంట్ పక్కన పెట్టి పూజ తర్వాత చిత్ర బృందాన్ని కలవడానికి వెళ్లడం ఒక హైలైట్ అయితే... మరొక హైలైట్ ఏమిటో తెలుసా?
View this post on Instagram
మహేష్, రాజమౌళి కలయికలో మొదటి సినిమా!
భారతీయ సినిమా చరిత్రలో... ఆ మాటకు వస్తే ప్రపంచ సినిమా చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకు అంటే... త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శక నిర్మాతలను మెప్పించడమే కాదు, ఆ సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చేలా చేయడంలో రాజమౌళి కృషిని ఎవరు మరువలేరు. తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ తీసుకువచ్చిన ఆయన ఇప్పుడు... మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ సినిమాలో అడుగు పెడుతున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఒక్క భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
మహేష్ బాబు, రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా ప్రియాంకా చోప్రాను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, విలన్ రోల్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారని టాక్. అయితే... చిత్ర బృందం హీరోయిన్, విలన్ వంటి తారాగణం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా... ఎంఎం కీరవాణి సంగీత సారథ్యం వహించనున్నారు.
Also Read: బన్నీని మళ్లీ కలిసిన కొరటాల... అప్పట్లో ఆగిన సినిమా పట్టాలు ఎక్కుతుందా? స్టేటస్ ఏమిటంటే?