అన్వేషించండి

Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?

How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు.

Salary TDS: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. TDS ఎంత కట్ అవుతుంది? దీని గురంచి ఎవరిని అడగాలి? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. దీనిపై క్లియర్ వ్యవస్థాపకుడు & CEO అర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. జీతం నుంచి TDS కట్ అయిన వ్యక్తులందరూ TDS రిటర్న్‌లను దాఖలు చేయడం తప్పనిసరి అన్నారు. ప్రతి త్రైమాసికానికి TDS రిటర్న్‌ను సమర్పించాల్సి ఉందన్నారు. ఇందుకు TAN, PAN, TDS తగ్గించబడిన మొత్తం వివరాలు అదించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206AA ప్రకారం, మీరు డిడక్టర్‌కు పాన్ కార్డు వివరాలు అందించకపోతే నిబంధనల మేరకు 20% శాతం లేదా అంతకంటే  ఎక్కువ TDS కట్ అవుతుంది. 

జీతంపై TDS ఎలా లెక్కిస్తారు?
సెక్షన్ 192 ప్రకారం, జీతం చెల్లింపు సమయంలో TDS మినహాయించబడుతుంది. యజమాని జీతం చెల్లిస్తున్నప్పుడు కట్ అయ్యే TDS, వచ్చే నెల అడ్వాన్స్, లేదా ఆ నెలకు సంబంధించినది, గడచిన నెల బకాయి అయ్యి ఉండొచ్చు. అంచనా వేతనం.. ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువ లేకపోతే TDS కట్ అవదు. PAN కార్డు లేని వారికి కూడా ఇది వర్తిస్తుంది. 

ముందుగా ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగి జీతాన్ని సంబంధిత యజమాని అంచనా వేస్తారు. ఇందులో బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్, ఎంప్లాయర్ మంజూరు చేసిన పెర్క్విసైట్‌లు, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ, మీల్ కూపన్‌లు మొదలైన ఇతర అలవెన్సులు, ఈపీఎఫ్, బోనస్, కమీషన్‌లు, గ్రాట్యుటీ ఆధారంగా ఉద్యోగి జీతాన్ని లెక్కిస్తారు. ఆ తరువాత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 కింద మినహాయింపులను గణిస్తారు. మినహాయింపులు HRA, ప్రయాణ ఖర్చులు, యూనిఫాం ఖర్చులు, పిల్లల ఫీజ్ అలవెన్సులు మొదలైన వాటికి వర్తిస్తాయి. వృత్తిపరమైన పన్ను, వినోద భత్యం, స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 తగ్గించవచ్చు.

ఉద్యోగి జీతం నుంచి యజమాని ఇలాంటి వాటి అన్నింటిని కట్ చేసిన తరువాత మిగిలే దానిని పన్ను చెల్లించదగిన జీతంగా పరిగణిస్తారు. ఒక వేళ ఉద్యోగి ఇతర ఆదాయాల గురించిన సమాచారాన్ని అందిస్తే (ఉదాహరణలు ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడు వచ్చే రెంట్, బ్యాంకు డిపాజిట్లు మొదలైనవి) వాటిని పన్ను చెల్లించదగిన వేతనం కింద చేరుస్తారు. హౌసింగ్ లోన్‌లపై చెల్లించే వడ్డీని ఇంటి ఆస్తి ఆదాయం నుంచి తొలగిస్తారు. ఇటువంటివి అన్నీ చేరికలు, తీసివేతలు అయ్యాక లెక్కించిన మొత్తం ఉద్యోగి మొత్తం స్థూల ఆదాయం అవుతుంది.

ఉద్యోగి సమర్పించిన ఇన్వెస్ట్‌మెంట్ డిక్లరేషన్ ఆధారంగా యజమాని లేదా సంస్థ ఆదాయపు పన్ను చట్టంలోని VI-A అధ్యాయం కిందకు వచ్చే పెట్టుబడులను తగ్గిస్తారు. డిక్లరేషన్‌లో PPF, ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్, ELSS మ్యూచువల్ ఫండ్స్, NSC, సుకన్య సమృద్ధి ఖాతా వంటి పెట్టుబడుల మొత్తాలు ఉండవచ్చు. అలాగే ఆదాయం నుంచి చెల్లించే గృహ రుణాలు, జీవిత బీమా ప్రీమియంలు, NSC, సుకన్య సమృద్ధి ఖాతా చెల్లింపులు ఉండవచ్చు. అలాగే సెక్షన్ 80D, 80G, మొదలైన అనేక ఇతర విభాగాల కింద  యజమాని మినహాయింపులను అనుమతిస్తారు.

ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి కొత్త పన్ను విధానం అమలులలోకి వచ్చింది. దాని ప్రకారం పన్ను రేట్ల టాక్స్ కాలుక్యులేషన్ ఉంటుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే ఆ విషయాన్ని యజమాని లేదా సంస్థకు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న పన్ను విధానం ప్రకారం యజమాని అతని/ఆమె ఆదాయపు పన్నును తీసివేయవచ్చు. కొత్త పన్ను విధానంలో అయితే ఎక్కవ మినహాయింపులు ఉండవు.

TDS తగ్గింపు రేటు
సెక్షన్ 192 TDS రేటును పేర్కొనలేదు. పన్ను చెల్లింపుదారులకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం TDS తీసివేయబడుతుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో యజమాని లేదా సంస్థ పన్ను గణనను చేస్తారు. ఉద్యోగి ఆర్థిక సంవత్సరంలో పని చేసిన నెలలను బట్టి TDS తీసివేయబడుతుంది. పాన్ కార్డు లేని ఉద్యోగులకు  20% TDS, 4% సెస్‌ ఉంటుందని గుప్తా చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget