By: ABP Desam | Updated at : 26 Dec 2021 05:40 PM (IST)
జీఎస్టీ
కొత్త సంవత్సరంలో వస్తు సేవల పన్ను రేట్లు, అమలు విధానంలో కొన్ని మార్పులు రానున్నాయి. జనవరి 1 నుంచి ఆన్‌లైన్ వేదికలు నిక్కచ్చిగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. యాప్‌ల ద్వారా ఆటో, క్యాబ్‌లు బుక్ చేసుకుంటే, ఆహారం తెప్పించుకుంటే సంబంధిత వేదికలే జీఎస్‌టీ కట్టాలి. ఫుట్‌వేర్, టెక్స్‌టైల్ రంగాల్లోన పన్ను చెల్లింపుల విధానం మారింది. ధరలతో సంబంధం లేకుండా వస్త్రాలు, ఫుట్‌వేర్‌పై 12 శాతం వరకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఉబెర్, ఓలా వంటి వేదికల ద్వారా ప్రయాణికులు బుక్ చేసుకుంటే పన్ను ఉండేది కాదు. ఇకపై ఈ వేదికల ద్వారా వాహనాలు ఎంపిక చేసుకొని ప్రయాణిస్తే జనవరి 1 నుంచి ఐదు శాతం జీఎస్‌టీ పడుతుంది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపైనా ఇదే వర్తించనుంది. స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌ల ద్వారా ఆహారం తెప్పించుకుంటే రెస్టారెంట్లకు బదులు ఈ వేదికలే ఐదు శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఈ భారం కస్టమర్‌పై ఉండదు. గత రెండేళ్లలో ఫుడ్ అగ్రిగేటర్లు రూ.2000 కోట్ల వరకు పన్ను తక్కువ చేసి చూపించడమే దీనికి కారణం.
ఇకపై పన్ను ఎగవేత దారులపై తీవ్ర చర్యలు ఉండబోతున్నాయి. కొత్త సంవత్సరం నుంచి జీఎస్‌టీ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఆధార్‌తో తప్పనిసరిగా అథెంటికేషన్ చేయాలి. వ్యాపారులు పన్నులు చెల్లించకపోతే, గత నెల జీఎస్‌టీఆర్-3బిని వెంటనే ఫైల్ చేయకపోతే రీఫండ్‌ను నిలిపివేస్తారు. కొత్త ఏడాది నుంచి పన్ను వసూలు చేసేందుకు జీఎస్‌టీ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వ్యాపార కార్యాలయాలకు వెళ్లొచ్చు. విక్రేతలు నకిలీ బిల్లులతో ఎక్కువ ఇన్‌పుట్ సబ్సిడీ కోసం క్లెయిమ్ చేస్తుండటమే ఇందుకు కారణం.
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్ లిస్టింగ్ సూపర్‌హిట్.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?
Petrol Price Today 25th June 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు, ఏపీలో పలు చోట్ల పెరిగిన ఇంధన ధరలు
Gold Rate Today 25th June 2022: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం ధర, నిలకడగానే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Niti Aayog New CEO: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ - ఆయన స్పెషాలిటీ తెలుసా!
Work From Home Latest News: వర్క్ ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు!
Netflix Lays Off Employees: నష్టాల్ని తట్టుకోలేక 300 ఉద్యోగుల్ని తీసేసిన నెట్‌ఫ్లిక్స్
Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిమ్మాయి
Watch Video: మియా ఖలీఫాను గుర్తు పట్టి బుక్ అయ్యాడు, కాస్ట్లీ బ్యాగ్‌తో భార్యను కూల్ చేశాడు-ఈ వీడియో చూశారా
Virata Parvam: విరాట పర్వానికి కమల్ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?
Special Hotel In Vizag: వైజాగ్‌లో సూరీడు నడిపించే హోటల్ గురించి తెలుసా?